Taanemta neevemta tana suddu livigo

తానెంత నీవెంత తన సుద్దు లివిగో
Language

(॥పల్లవి॥)
తానెంత నీవెంత తన సుద్దు లివిగో
నీనూ నీవూఁ జుట్టాలమై నెమ్మది నున్నారము

(॥తానెం॥)
ముంగిటికి వచ్చి వచ్చి మొకము చూపి నిన్ను
వుంగరమడిగెఁ జెలి వొయ్యనొయ్యనే
సంగడినే కూచుండి జాణతనాలెల్లా నాడి
యెంగిలి సే సె మోవి యాకె యెంత రట్టడి

(॥తానెం॥)
సెలవుల నవ్వి నవ్వి చెతులెత్తి మొక్కి యిట్టె
మెలఁగి చన్నులు చూపె మెల్ల మెల్లనె
చెలుములు సేసి మరిచేరి సన్న నీకుఁ జూపి
యెలమిఁ బాదముదొక్కె నీకె యెంత రట్టడి

(॥తానెం॥)
ఇచ్చకము లాడియాడి ఇంపులు నీపైఁ జల్లి
కొచ్చి కొచ్చి తమిరేఁచెఁ గూడఁగూడనె
యిచ్చట శ్రీవేంకటేశ యిట్టే నన్నుఁ గూడితివి
హెచ్చి గోరఁ దా నిన్నంటె యాకె యెంత రట్టడి

(||pallavi||)
tānĕṁta nīvĕṁta tana suddu livigo
nīnū nīvūm̐ juṭṭālamai nĕmmadi nunnāramu

(||tānĕṁ||)
muṁgiḍigi vachchi vachchi mŏgamu sūbi ninnu
vuṁgaramaḍigĕm̐ jĕli vŏyyanŏyyane
saṁgaḍine kūsuṁḍi jāṇadanālĕllā nāḍi
yĕṁgili se sĕ movi yāgĕ yĕṁta raṭṭaḍi

(||tānĕṁ||)
sĕlavula navvi navvi sĕdulĕtti mŏkki yiṭṭĕ
mĕlam̐gi sannulu sūbĕ mĕlla mĕllanĕ
sĕlumulu sesi mariseri sanna nīgum̐ jūbi
yĕlamim̐ bādamudŏkkĕ nīgĕ yĕṁta raṭṭaḍi

(||tānĕṁ||)
ichchagamu lāḍiyāḍi iṁpulu nībaim̐ jalli
kŏchchi kŏchchi tamirem̐sĕm̐ gūḍam̐gūḍanĕ
yichchaḍa śhrīveṁkaḍeśha yiṭṭe nannum̐ gūḍidivi
hĕchchi goram̐ dā ninnaṁṭĕ yāgĕ yĕṁta raṭṭaḍi