తానేల యెగ్గులువట్టీ తన మన సెరుఁగును
(॥పల్లవి॥)
తానేల యెగ్గులువట్టీ తన మన సెరుఁగును
యే నెపము నెంచను యీడకు రమ్మనవే
(॥తానే॥)
సవతిపై కాఁకల వేసారి తను దూరీతి
వివరించి చూచుకొంటే వింతా తాను
పవళించి నాఁడందుకు పక్కన జిన్నఁబోయి
ఇవల దా మంచివాఁడే యీడకు రమ్మనవే
(॥తానే॥)
ఆకె యెమ్మెలెల్లాఁ చూచి ఆరడి తనుఁ బెట్టి
పైకొని తెలుసుకొంటే పగలా తాను
దాకొని బాసలుసేసి తనలోనే కరఁగుచు
యేకపోఁ దనకునేల యీడకు రమ్మనవే
(॥తానే॥)
అక్కతోడి వరసలు నట్టె తన్ను నాఁగితి
ఇక్కువ దలఁచుకొంటే యెరవా తాను
చిక్కి నన్నుఁ గూడినాఁడు శ్రీవేంకటేశ్వరుండు
యిక్కడా నక్కడా నేల యీడకు రమ్మనవే
(||pallavi||)
tānela yĕgguluvaṭṭī tana mana sĕrum̐gunu
ye nĕbamu nĕṁchanu yīḍagu rammanave
(||tāne||)
savadibai kām̐kala vesāri tanu dūrīdi
vivariṁchi sūsugŏṁṭe viṁtā tānu
pavaḽiṁchi nām̐ḍaṁdugu pakkana jinnam̐boyi
ivala dā maṁchivām̐ḍe yīḍagu rammanave
(||tāne||)
āgĕ yĕmmĕlĕllām̐ sūsi āraḍi tanum̐ bĕṭṭi
paigŏni tĕlusugŏṁṭe pagalā tānu
dāgŏni bāsalusesi tanalone karam̐gusu
yegabom̐ danagunela yīḍagu rammanave
(||tāne||)
akkadoḍi varasalu naṭṭĕ tannu nām̐gidi
ikkuva dalam̐sugŏṁṭe yĕravā tānu
sikki nannum̐ gūḍinām̐ḍu śhrīveṁkaḍeśhvaruṁḍu
yikkaḍā nakkaḍā nela yīḍagu rammanave