Taanela vitraveemgeene tarunulimdarilona

తానేల విఱ్ఱవీఁగీనే తరుణులిందరిలోన
Language

(॥పల్లవి॥)
తానేల విఱ్ఱవీఁగీనే తరుణులిందరిలోన
నేనెఱిఁగినవే తన నేరుపు లన్నియును

(॥॥)
పంతమాడవచ్చుఁగాక పదనెరిఁగి విభుని-
చెంత నుండి యిచ్చకము సేయవచ్చునా
వంతులకు జలకించవచ్చుఁగాక లోలోన
అంతరంగమెల్లాఁ దానై వుండవచ్చునా

(॥॥)
పెనఁగవచ్చుఁగాక ప్రియము గై కొని నిండుఁ-
జనవుతో వలపులు చల్లవచ్చునా
చెనకఁగ వచ్చుఁగాక చెల్లుబడి సేసుకొని
పనిగొని కూరిములు పచారించవచ్చునా

(॥॥)
నాటఁజూడవచ్చుఁగాక నంటున శ్రీవేంకటేశుఁ-
కూటపురతులెల్లాఁ జేకొనవచ్చునా
నీటు చూపవచ్చుఁగాక నిక్కముగా నావలెనే
సాటికి బేటికి మోవి చవిగొనవచ్చునా

(||pallavi||)
tānela viṭravīm̐gīne taruṇuliṁdarilona
nenĕṟim̐ginave tana nerubu lanniyunu

(||||)
paṁtamāḍavachchum̐gāga padanĕrim̐gi vibhuni-
sĕṁta nuṁḍi yichchagamu seyavachchunā
vaṁtulagu jalagiṁchavachchum̐gāga lolona
aṁtaraṁgamĕllām̐ dānai vuṁḍavachchunā

(||||)
pĕnam̐gavachchum̐gāga priyamu gai kŏni niṁḍum̐-
janavudo valabulu sallavachchunā
sĕnagam̐ga vachchum̐gāga sĕllubaḍi sesugŏni
panigŏni kūrimulu pasāriṁchavachchunā

(||||)
nāḍam̐jūḍavachchum̐gāga naṁṭuna śhrīveṁkaḍeśhum̐-
kūḍaburadulĕllām̐ jegŏnavachchunā
nīḍu sūbavachchum̐gāga nikkamugā nāvalĕne
sāḍigi beḍigi movi savigŏnavachchunā