Taanela sigguvadeeni tanado ne nemanenu

తానేల సిగ్గువడీని తనతో నే నేమనేను
Language

(॥పల్లవి॥)
తానేల సిగ్గువడీని తనతో నే నేమనేను
పూనిపట్టి చెలులాల బుద్ది చెప్పఁగదరే

(॥తానే॥)
చిప్పిలఁ దానూ నేనుఁ జేసుకొన్న బాసలకు
తప్పులెంచ నున్నదా తనపై నేను
కుప్పళించి పెంజెమటఁ గురియఁగా నే మొక్కితేను
పిప్పిగట్టఁ బెదవులఁ బిలువరే విభుని

(॥తానే॥)
సొగసి ఇద్దరికిని చుట్టరికమైనందుకు
తగదని కోపించేదా తనతో నేను
నిగిడి నిట్టూర్పులు నిండఁగా నేఁ బెనఁగేను
జిగి నన్ను నేలుమని సేయరే సేవలు

(॥తానే॥)
బెరసి మేనవారమై పెండ్లాడినయందుకు
వొరసి గోరగీరేనా వొళ్లిపై నేను
ఇరవై శ్రీ వేంకటేశు నిన్నిటా నేఁ బొగడేను
నిరతపు మన్ననలు నించుమనఁగదరే

(||pallavi||)
tānela sigguvaḍīni tanado ne nemanenu
pūnibaṭṭi sĕlulāla buddi sĕppam̐gadare

(||tāne||)
sippilam̐ dānū nenum̐ jesugŏnna bāsalagu
tappulĕṁcha nunnadā tanabai nenu
kuppaḽiṁchi pĕṁjĕmaḍam̐ guriyam̐gā ne mŏkkidenu
pippigaṭṭam̐ bĕdavulam̐ biluvare vibhuni

(||tāne||)
sŏgasi iddarigini suṭṭarigamainaṁdugu
tagadani kobiṁchedā tanado nenu
nigiḍi niṭṭūrbulu niṁḍam̐gā nem̐ bĕnam̐genu
jigi nannu nelumani seyare sevalu

(||tāne||)
bĕrasi menavāramai pĕṁḍlāḍinayaṁdugu
vŏrasi goragīrenā vŏḽlibai nenu
iravai śhrī veṁkaḍeśhu ninniḍā nem̐ bŏgaḍenu
niradabu mannanalu niṁchumanam̐gadare