Taanela sigguvadeeni damdagitte vachchumgaaga

తానేల సిగ్గువడీని దండకిట్టె వచ్చుఁగాక
Language

(॥పల్లవి॥)
తానేల సిగ్గువడీని దండకిట్టె వచ్చుఁగాక
యే నెపమూ వేయఁ దనకేమిటికే కొంకను

(॥॥)
చేరి చేఁత సేయక చేతులెత్తి మొక్కితి
మేరతోడ శిరసె త్తి మెచ్చితి దన్ను
నేరము లెంచనేరక నెట్టుకొని పొగడితి
యీరసించేదాన గాను యిఁకనేమి సేతునే

(॥॥)
కమ్మి కోపగించక కన్నులనే చూచితి
నమ్మిక లడుగక నవ్వు నవ్వితి
పిమ్మట నలుగక పెనఁగి పాదాలొత్తితి
యెమ్మెలదానఁగాను యేమి సేతునే

(॥॥)
తనకెదురాడక తమ్ముల మడిగితిని
మనసు నొప్పించక మర్మమంటితి
యెనసె శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను
యినుమడించె వలవు లేమి సేతునే

(||pallavi||)
tānela sigguvaḍīni daṁḍagiṭṭĕ vachchum̐gāga
ye nĕbamū veyam̐ danagemiḍige kŏṁkanu

(||||)
seri sem̐ta seyaga sedulĕtti mŏkkidi
meradoḍa śhirasĕ tti mĕchchidi dannu
neramu lĕṁchaneraga nĕṭṭugŏni pŏgaḍidi
yīrasiṁchedāna gānu yim̐kanemi sedune

(||||)
kammi kobagiṁchaga kannulane sūsidi
nammiga laḍugaga navvu navvidi
pimmaḍa nalugaga pĕnam̐gi pādālŏttidi
yĕmmĕladānam̐gānu yemi sedune

(||||)
tanagĕdurāḍaga tammula maḍigidini
manasu nŏppiṁchaga marmamaṁṭidi
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
yinumaḍiṁchĕ valavu lemi sedune