Taanela sigguvadeene tanagele verabu

తానేల సిగ్గువడీనే తనకెలే వెరపు
Language

(॥పల్లవి॥)
తానేల సిగ్గువడీనే తనకెలే వెరపు
నానాటి సుద్దులకు నవ్వేఁగాక

(॥తానే॥)
యేలే తనతో నాకు నెక్కువ తక్కువ లాడ
మేలుమేలనుచుఁ గడుమేచ్చేఁగాక
చాలుకొని యప్పటిని చలము సాదించనేల
కేలెత్తి తనకు మొక్కి గెలిచేఁగాక

(॥తానే॥)
పైకొని తన్నింతేసిబాసలు గొనఁగనేలే
యేకొలఁది కాకొలఁది యేనసేఁగాక
దీకొని మారుకుమారు తిట్లు దిట్టగనేలే
వాకున మంచి మాఁటాడి వలపించేఁగాక

(॥తానే॥)
కనుచూపులను తన్ను కాంకలఁబెట్టఁగనేలే
చనుమొన లొత్తి మేలు చల్లేఁగాక
యెనసె శ్రీవేంకటేశుఁ డింతలోనే తానె నన్ను
పెనఁగనేలె రతుల బెరయించేఁగాక

(||pallavi||)
tānela sigguvaḍīne tanagĕle vĕrabu
nānāḍi suddulagu navvem̐gāga

(||tāne||)
yele tanado nāgu nĕkkuva takkuva lāḍa
melumelanusum̐ gaḍumechchem̐gāga
sālugŏni yappaḍini salamu sādiṁchanela
kelĕtti tanagu mŏkki gĕlisem̐gāga

(||tāne||)
paigŏni tanniṁtesibāsalu gŏnam̐ganele
yegŏlam̐di kāgŏlam̐di yenasem̐gāga
dīgŏni mārugumāru tiṭlu diṭṭaganele
vāguna maṁchi mām̐ṭāḍi valabiṁchem̐gāga

(||tāne||)
kanusūbulanu tannu kāṁkalam̐bĕṭṭam̐ganele
sanumŏna lŏtti melu sallem̐gāga
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalone tānĕ nannu
pĕnam̐ganelĕ radula bĕrayiṁchem̐gāga