Taanela sigguvadeene tadava nenu

తానేల సిగ్గువడీనే తడవ నేను
Language

(॥పల్లవి॥)
తానేల సిగ్గువడీనే తడవ నేను
పూని తన్ను దేవరఁగాఁ బూజింతు నేను

(॥తానే॥)
అలసివచ్చినవాని కటు విసరుదుఁ గాని
అలరి యాపనులెల్ల్ నడుగ నేను
చెలపచెమటలెల్లా చేతనే తుడుతుఁగాని
జలకమాడి రమ్మని సాదించ నేను

(॥తానే॥)
నిదుల కన్నుల నుంటే నేఁ బాదాలొత్తుదుఁగాని
చెదరుచు యెఱుకలు సేసుకో నేను
పెదవులు వాడితే దప్పికి విడెమిత్తుఁగాని
పొదిగి మొగము చిన్నఁబుచ్చుకొన నేను

(॥తానే॥)
చిత్తజచిహ్నలు చూచి చేరి కాఁగిలింతుఁగాని
వొత్తి యాడవని మరీ నొరయ నేను
హత్తెను శ్రీవేంకటేశుఁ డలమేల్మంను నేను
కొత్తలుగా నేలె నిఁక కొసర నేను

(||pallavi||)
tānela sigguvaḍīne taḍava nenu
pūni tannu devaram̐gām̐ būjiṁtu nenu

(||tāne||)
alasivachchinavāni kaḍu visarudum̐ gāni
alari yābanulĕll naḍuga nenu
sĕlabasĕmaḍalĕllā sedane tuḍudum̐gāni
jalagamāḍi rammani sādiṁcha nenu

(||tāne||)
nidula kannula nuṁṭe nem̐ bādālŏttudum̐gāni
sĕdarusu yĕṟugalu sesugo nenu
pĕdavulu vāḍide dappigi viḍĕmittum̐gāni
pŏdigi mŏgamu sinnam̐buchchugŏna nenu

(||tāne||)
sittajasihnalu sūsi seri kām̐giliṁtum̐gāni
vŏtti yāḍavani marī nŏraya nenu
hattĕnu śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁnu nenu
kŏttalugā nelĕ nim̐ka kŏsara nenu