తానేల సిగ్గువడీ తనకు నాకు భేదమా
(॥పల్లవి॥)
తానేల సిగ్గువడీ తనకు నాకు భేదమా
మేనదాన నన్నిటాను మేలుదాన ననవే
(॥తానే॥)
వెంగె మాడ నేరఁగాని వినయము శాయ నేర్తు
యింగితాన తనమోహ మేడ నుండినా
సంగతి యడ మాఁటలు సారె నాడించీఁ దాను
కంగుదేరఁ దానే యిక్కడకు రమ్మనవే
(॥తానే॥)
చలపట్టు నేరఁగాని సమ్మతించ నేరుతును
వెలుపలఁ దన కేమివేడుకైనను
తెలియనా నే నేమైనా తెరమాఁటేల తనకు
కలఁగదు నామనసు కదియ రమ్మనవే
(॥తానే॥)
కోవగించ నేరఁగాని కూరిమిఁ గూడఁగ నేర్తు
యేపాటి చనవు నా కిట్టె యిచ్చినా
యేపున శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను
చేపట్టి నన్నేలినాఁడు చేరఁగ రమ్మనవే
(||pallavi||)
tānela sigguvaḍī tanagu nāgu bhedamā
menadāna nanniḍānu meludāna nanave
(||tāne||)
vĕṁgĕ māḍa neram̐gāni vinayamu śhāya nerdu
yiṁgidāna tanamoha meḍa nuṁḍinā
saṁgadi yaḍa mām̐ṭalu sārĕ nāḍiṁchīm̐ dānu
kaṁguderam̐ dāne yikkaḍagu rammanave
(||tāne||)
salabaṭṭu neram̐gāni sammadiṁcha nerudunu
vĕlubalam̐ dana kemiveḍugainanu
tĕliyanā ne nemainā tĕramām̐ṭela tanagu
kalam̐gadu nāmanasu kadiya rammanave
(||tāne||)
kovagiṁcha neram̐gāni kūrimim̐ gūḍam̐ga nerdu
yebāḍi sanavu nā kiṭṭĕ yichchinā
yebuna śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
sebaṭṭi nannelinām̐ḍu seram̐ga rammanave