తానేల మూసి దాఁచీనే తన వలపు
(॥పల్లవి॥)
తానేల మూసి దాఁచీనే తన వలపు
ఆనతిమ్మనవే నాతో నట్టె నవ్వే నేను
(॥తానే॥)
వీనులఁ దన సుద్దులు వింటే నేమాయనే
నేనేమైనాఁ దన్ను నిఁక నేరమెంచేనా
తానేమి సేసినాఁ జెల్లు దగ్గరి రమ్మనవే
మోనముతోఁ జెక్కు నొక్కి మొదమందే నేనూ
(॥తానే॥)
కన్నులఁ దనచేఁతలు కంటె నేమాయనే
చిన్నదానఁ దన్ను రట్టుసేసి చెప్పేనా
యిన్నీ నేరుచు నన్ను మోమెత్తి చూడుమనవే
సన్నలఁ దనగుణాలు సంతోసించే నేనూ
(॥తానే॥)
వొట్టి తనమై గుఱుతులుంటే నేమాయనే
పట్టి సోదించి తనతో పంగించేనా
యిట్టె శ్రీవేంకటేశుఁ డేలె నన్ను మేలనవే
గుట్టతోఁ దనరతులు కోరి మెచ్చే నేనూ
(||pallavi||)
tānela mūsi dām̐sīne tana valabu
ānadimmanave nādo naṭṭĕ navve nenu
(||tāne||)
vīnulam̐ dana suddulu viṁṭe nemāyane
nenemainām̐ dannu nim̐ka neramĕṁchenā
tānemi sesinām̐ jĕllu daggari rammanave
monamudom̐ jĕkku nŏkki mŏdamaṁde nenū
(||tāne||)
kannulam̐ danasem̐talu kaṁṭĕ nemāyane
sinnadānam̐ dannu raṭṭusesi sĕppenā
yinnī nerusu nannu momĕtti sūḍumanave
sannalam̐ danaguṇālu saṁtosiṁche nenū
(||tāne||)
vŏṭṭi tanamai guṟuduluṁṭe nemāyane
paṭṭi sodiṁchi tanado paṁgiṁchenā
yiṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nannu melanave
guṭṭadom̐ danaradulu kori mĕchche nenū