తానేల లోఁగీ నిదె తనలోఁ దాను
(॥పల్లవి॥)
తానేల లోఁగీ నిదె తనలోఁ దాను
వూనిన పంతములకు వొరసేనా నేను
(॥తానే॥)
పోరచిసతులతోను బొందు లెంతసేసినాను
తారుకాణించవచ్చేనా తనతో నేను
సారె సారె విన్నపాలు సతులచే వింటేను
ఆరసి చెప్పుమనుచు నడిగేనా నేను
(॥తానే॥)
చక్కఁదనా లెవ్వరిని చవులుగాఁ బొగడినా
కక్కసించి వద్దనేనా కమ్మటి నేను
కిక్కిరియ మరి నెంత కిందుపడి గూడినాను
చిక్కించు కెవ్వరికైనాఁ జెప్పేనా నేను
(॥తానే॥)
చెలులచే నేమేమి సేవలు సేయించుకొన్నా
చెలరేఁగి యాగడాలు సేసేనా నేను
యెలమి శ్రీ వేంకటేశుఁడేలినాఁడు తానె నన్ను
చలము లేమిటికైనా సాదించేనా నేను
(||pallavi||)
tānela lom̐gī nidĕ tanalom̐ dānu
vūnina paṁtamulagu vŏrasenā nenu
(||tāne||)
porasisaduladonu bŏṁdu lĕṁtasesinānu
tārugāṇiṁchavachchenā tanado nenu
sārĕ sārĕ vinnabālu sadulase viṁṭenu
ārasi sĕppumanusu naḍigenā nenu
(||tāne||)
sakkam̐danā lĕvvarini savulugām̐ bŏgaḍinā
kakkasiṁchi vaddanenā kammaḍi nenu
kikkiriya mari nĕṁta kiṁdubaḍi gūḍinānu
sikkiṁchu kĕvvarigainām̐ jĕppenā nenu
(||tāne||)
sĕlulase nememi sevalu seyiṁchugŏnnā
sĕlarem̐gi yāgaḍālu sesenā nenu
yĕlami śhrī veṁkaḍeśhum̐ḍelinām̐ḍu tānĕ nannu
salamu lemiḍigainā sādiṁchenā nenu