తానేల కొసరీనే తరుణి నన్ను
(॥పల్లవి॥)
తానేల కొసరీనే తరుణి నన్ను
మోనాన నే సరివచ్చే మొక్కల మేది
(॥తానే॥)
పిలిచితె రాఁగానే పెనఁగుతా నున్నాఁడ
యెలమి నాచేఁతలు నే నేమందునే
చలము చెల్లుండగాను జంకెనకు లోనైతి
పలుకులఁ దెల్ల వారె పంత మేదె
(॥తానే॥)
తగవు నడపఁగానే తన్ను మెచ్చుచున్నాఁడ
అగపడి నావోరు పేమని మెత్తునే
మొగవమోట గలిగియు మొరఁగుకు లోనైతి
నగవులే నాఁ జొచ్చె నాలి యేదే
(॥తానే॥)
ముంచి నన్నుఁ గూడఁగానే వెక్కుతా నే నున్నాఁడ
వంచనకు నాతో యెవ్వరు యీడె
యెంచ కిట్టె శ్రీవేంకటేశుఁడ నేఁగూడితిని
మంచముపై వావి గూడె మఱగేదే
(||pallavi||)
tānela kŏsarīne taruṇi nannu
monāna ne sarivachche mŏkkala medi
(||tāne||)
pilisidĕ rām̐gāne pĕnam̐gudā nunnām̐ḍa
yĕlami nāsem̐talu ne nemaṁdune
salamu sĕlluṁḍagānu jaṁkĕnagu lonaidi
palugulam̐ dĕlla vārĕ paṁta medĕ
(||tāne||)
tagavu naḍabam̐gāne tannu mĕchchusunnām̐ḍa
agabaḍi nāvoru pemani mĕttune
mŏgavamoḍa galigiyu mŏram̐gugu lonaidi
nagavule nām̐ jŏchchĕ nāli yede
(||tāne||)
muṁchi nannum̐ gūḍam̐gāne vĕkkudā ne nunnām̐ḍa
vaṁchanagu nādo yĕvvaru yīḍĕ
yĕṁcha kiṭṭĕ śhrīveṁkaḍeśhum̐ḍa nem̐gūḍidini
maṁchamubai vāvi gūḍĕ maṟagede