తానేడ వారేడ తనువేడ మరి తక్కినవెల్లా నేడ
(॥పల్లవి॥)
తానేడ వారేడ తనువేడ మరి తక్కినవెల్లా నేడ
మానలే ననుచు తరితీపు సేసే మనసేడ నుండునో
(॥తానే॥)
కందువమానిపై నోరూరించెటికాయలుఁ బండ్లుపక్వముదప్పిన
అందముగ మున్ను గోరినట్టివారి యాసలెందుండునో
పొందున వలచి పులకించినట్టిపురుషులు సతులట్టెముదిసితె
ముందర వెనక నెరఁగనియ్యనిమోహ మెందుండునో
(॥తానే॥)
కొత్తమెరుఁగులచేత భ్రమయించే కోకలు చివిరె పాఁతగిలితె
బత్తితోఁ గావలె నని కొన్నవారిభ్రమ లెందుండునో
రిత్తజవ్వనాన కొప్పుగోళ్ల దిద్ది రీతిగానుండెటి సింగారంబులు
పత్తివలెనై బట్టగట్టఁదనభావ మెందుండునో
(॥తానే॥)
తావితో బుగులుకొనెటివూవులు దాఁపఁగ నవియె వాడినపిమ్మట
భావించి చూచితే నందలి తొల్లిటిపస యెందుండునో
శ్రీవెంకటనాథుఁ డిట్టె యేలెఁగాకచెల్లఁ బోతాఁదొల్లి భోగించినవెల్ల
వేవేగ మరునాఁ డవియె చూడ నేవిధమైయుండునో
(||pallavi||)
tāneḍa vāreḍa tanuveḍa mari takkinavĕllā neḍa
mānale nanusu taridību sese manaseḍa nuṁḍuno
(||tāne||)
kaṁduvamānibai norūriṁchĕḍigāyalum̐ baṁḍlubakvamudappina
aṁdamuga munnu gorinaṭṭivāri yāsalĕṁduṁḍuno
pŏṁduna valasi pulagiṁchinaṭṭiburuṣhulu sadulaṭṭĕmudisidĕ
muṁdara vĕnaga nĕram̐ganiyyanimoha mĕṁduṁḍuno
(||tāne||)
kŏttamĕrum̐gulaseda bhramayiṁche kogalu sivirĕ pām̐tagilidĕ
battidom̐ gāvalĕ nani kŏnnavāribhrama lĕṁduṁḍuno
rittajavvanāna kŏppugoḽla diddi rīdigānuṁḍĕḍi siṁgāraṁbulu
pattivalĕnai baṭṭagaṭṭam̐danabhāva mĕṁduṁḍuno
(||tāne||)
tāvido bugulugŏnĕḍivūvulu dām̐pam̐ga naviyĕ vāḍinabimmaḍa
bhāviṁchi sūside naṁdali tŏlliḍibasa yĕṁduṁḍuno
śhrīvĕṁkaḍanāthum̐ ḍiṭṭĕ yelĕm̐gāgasĕllam̐ bodām̐dŏlli bhogiṁchinavĕlla
vevega marunām̐ ḍaviyĕ sūḍa nevidhamaiyuṁḍuno