(॥పల్లవి॥)
తానేడ నేనేడ దగ్గరీ వీఁడు
పూని కన్నులఁ దిట్టినా పోఁడే వీఁడు
(॥॥)
సారెకుఁ దప్పక చూచి జాణతనాలాడీని
పోరి పోరి వద్దన్నాఁ బోఁడే వీఁడే
పేరుకొని పిలిచీని పెదవుల గొణఁగీని
పూరకున్నా నవ్వుతాను వొరసీనే వీఁడు
(॥॥)
పానుపుపైఁ బవళించీఁ బనులుచెప్పఁ బిలిచీ
మోనాన నే నుండినాను మొక్కీనే వీఁడు
మానములు సోఁక నవ్వీ మంతనాలే వెదకీని
వీనులు చొరఁగనీడు విన్నపాలు వినఁడు
(॥॥)
పట్టినచలమే పెంచీఁ బైఁ జేయివేసీని
గుట్టున నుండఁడు నాతోఁ గొంతైనా వీఁడు
యిట్టె శ్రీ వేంకటేశుఁ డెలయించి నన్నుఁ గూడె
ఱట్టు కెక్కించెను నన్నాఱడిసేసి వీఁడు
(||pallavi||)
tāneḍa neneḍa daggarī vīm̐ḍu
pūni kannulam̐ diṭṭinā pom̐ḍe vīm̐ḍu
(||||)
sārĕgum̐ dappaga sūsi jāṇadanālāḍīni
pori pori vaddannām̐ bom̐ḍe vīm̐ḍe
perugŏni pilisīni pĕdavula gŏṇam̐gīni
pūragunnā navvudānu vŏrasīne vīm̐ḍu
(||||)
pānububaim̐ bavaḽiṁchīm̐ banulusĕppam̐ bilisī
monāna ne nuṁḍinānu mŏkkīne vīm̐ḍu
mānamulu som̐ka navvī maṁtanāle vĕdagīni
vīnulu sŏram̐ganīḍu vinnabālu vinam̐ḍu
(||||)
paṭṭinasalame pĕṁchīm̐ baim̐ jeyivesīni
guṭṭuna nuṁḍam̐ḍu nādom̐ gŏṁtainā vīm̐ḍu
yiṭṭĕ śhrī veṁkaḍeśhum̐ ḍĕlayiṁchi nannum̐ gūḍĕ
ṟaṭṭu kĕkkiṁchĕnu nannāṟaḍisesi vīm̐ḍu