Taane yeṟumgunu ramanumdu tana kedu raadenaa

తానే యెఱుఁగును రమణుఁడు తన కెదు రాడేనా
Language

(॥పల్లవి॥)
తానే యెఱుఁగును రమణుఁడు తన కెదు రాడేనా
నానెనుఁ జెమటలఁ బులకలు నటనకుఁ బనిలేదే

(॥తానే॥)
కోపమూ కనుల నున్నది కూరిమి మదిలో నున్నది
యేపునఁ బతి కింక నుత్తర మేమని చెప్పుదునే
తీపులు మాటల నున్నవి తెగువలు కాఁకల నున్నవి
రాపుగఁ బతివద్దికి నే రాకుండుట మేలే

(॥తానే॥)
జంకెల బొమ్మల నున్నవి చనవులు మొక్కుల నున్నవి
బింకముతోఁ బేర్కొని తనుఁ బిలువఁగఁ జో టేదే
మంకులు వొట్టుల నున్నవి మర్మము పైపై నున్నది
యింకా బుద్దులు మి రిఁక నేమని చెప్పేరే

(॥తానే॥)
వలపులూ కౌఁగిట నున్నవి వాసులు సిగ్గుల నున్నవి
తల దడిసెను చలి వాసెను తా నేమనఁ గలఁడే
వలె నని శ్రీవేంకటపతి వడదేరిచి ననుఁ గూడెను
నిలువున ముంచెను మరపులు నేరములెంచకురే

(||pallavi||)
tāne yĕṟum̐gunu ramaṇum̐ḍu tana kĕdu rāḍenā
nānĕnum̐ jĕmaḍalam̐ bulagalu naḍanagum̐ banilede

(||tāne||)
kobamū kanula nunnadi kūrimi madilo nunnadi
yebunam̐ badi kiṁka nuttara memani sĕppudune
tībulu māḍala nunnavi tĕguvalu kām̐kala nunnavi
rābugam̐ badivaddigi ne rāguṁḍuḍa mele

(||tāne||)
jaṁkĕla bŏmmala nunnavi sanavulu mŏkkula nunnavi
biṁkamudom̐ bergŏni tanum̐ biluvam̐gam̐ jo ṭede
maṁkulu vŏṭṭula nunnavi marmamu paibai nunnadi
yiṁkā buddulu mi rim̐ka nemani sĕppere

(||tāne||)
valabulū kaum̐giḍa nunnavi vāsulu siggula nunnavi
tala daḍisĕnu sali vāsĕnu tā nemanam̐ galam̐ḍe
valĕ nani śhrīveṁkaḍabadi vaḍaderisi nanum̐ gūḍĕnu
niluvuna muṁchĕnu marabulu neramulĕṁchagure