తానె యెఱుఁగుఁ గాక తరవాతి చేఁతలు
(॥పల్లవి॥)
తానె యెఱుఁగుఁ గాక తరవాతి చేఁతలు
వీనుల మా బుద్దు లిఁక వినేవా నీవయ్యా
(॥తానె॥)
పైకొని చెలియనీకుఁ గానుక వట్టు కుండఁగ
యేకడో పరా కై వుంటి విందాఁకను
సాకిరి వెట్టెను సన్నీ సరితలు చూడు మంటా
యీకడ నిన్ను నేనే యే మనఁగల నయ్యా
(॥తానె॥)
దగ్గరి విన్నపానకు తరుణి గాచు కుండఁగా
వొగ్గక వంటివి తడ వున్నదాఁకాను
యెగ్గు వట్టి మాఁటు నేసీ నిటువంటివాఁడ వని
దిగ్గన నీ వోజలు దిద్దేనా నే నయ్యా
(॥తానె॥)
లోనికిఁ దీసి ని న్నింతి లోను సేసుకొనఁగాను
మోహనాననే వుంటి వట మొక్కుదాఁకను
పూని శ్రీవెంటేశ నీ పొందిక నాతోఁ జెప్పె
నే ననకున్న నంతేసి నేరవా నీ వయ్యా
(||pallavi||)
tānĕ yĕṟum̐gum̐ gāga taravādi sem̐talu
vīnula mā buddu lim̐ka vinevā nīvayyā
(||tānĕ||)
paigŏni sĕliyanīgum̐ gānuga vaṭṭu kuṁḍam̐ga
yegaḍo parā kai vuṁṭi viṁdām̐kanu
sāgiri vĕṭṭĕnu sannī saridalu sūḍu maṁṭā
yīgaḍa ninnu nene ye manam̐gala nayyā
(||tānĕ||)
daggari vinnabānagu taruṇi gāsu kuṁḍam̐gā
vŏggaga vaṁṭivi taḍa vunnadām̐kānu
yĕggu vaṭṭi mām̐ṭu nesī niḍuvaṁṭivām̐ḍa vani
diggana nī vojalu diddenā ne nayyā
(||tānĕ||)
lonigim̐ dīsi ni nniṁti lonu sesugŏnam̐gānu
mohanānane vuṁṭi vaḍa mŏkkudām̐kanu
pūni śhrīvĕṁṭeśha nī pŏṁdiga nādom̐ jĕppĕ
ne nanagunna naṁtesi neravā nī vayyā