Taane yeṟumgum gaaga damdanunnaamdu vibhumdu

తానే యెఱుఁగుఁ గాక దండనున్నాఁడు విభుఁడు
Language

(॥పల్లవి॥)
తానే యెఱుఁగుఁ గాక దండనున్నాఁడు విభుఁడు
యీనేరుపు లీకత లేమని చెప్పుదునే

(॥॥)
చిత్తములోపలిసిగ్గు చెప్పరాదు
బత్తితోడి తలపోఁత భావించరాదు
గుత్తపు గుబ్బలవుబ్బు గురి లేదు
యిత్తల నోచెలులాల యేమని చెప్పుదునే

(॥॥)
వాడికనాకోరిక వశగాదు
వేడుకకు నెంతైనాను వెలలేదు
వోడక నాతమకము వోరువరాదు
యీడనె నాయడియాస లేమని చెప్పుదునే

(॥॥)
తొట్టుకున్న జవ్వనము దొబ్బితేఁ బోదు
చుట్టుకున్ననావలపు చూపరాదు
యిట్టె శ్రీవేంకటేశుఁ డింతలోనే నన్నుఁ గూడె
యెట్టనెదిటి సంతోస మేమని చెప్పుదునే

(||pallavi||)
tāne yĕṟum̐gum̐ gāga daṁḍanunnām̐ḍu vibhum̐ḍu
yīnerubu līgada lemani sĕppudune

(||||)
sittamulobalisiggu sĕpparādu
battidoḍi talabom̐ta bhāviṁcharādu
guttabu gubbalavubbu guri ledu
yittala nosĕlulāla yemani sĕppudune

(||||)
vāḍiganāgoriga vaśhagādu
veḍugagu nĕṁtainānu vĕlaledu
voḍaga nādamagamu voruvarādu
yīḍanĕ nāyaḍiyāsa lemani sĕppudune

(||||)
tŏṭṭugunna javvanamu dŏbbidem̐ bodu
suṭṭugunnanāvalabu sūbarādu
yiṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalone nannum̐ gūḍĕ
yĕṭṭanĕdiḍi saṁtosa memani sĕppudune