Taane yeṟumgum badi talampimchare

తానే యెఱుఁగుఁ బతి తలఁపించరే
Language

(॥పల్లవి॥)
తానే యెఱుఁగుఁ బతి తలఁపించరే
యీ నెలఁత మేలుదాయ నెట్టోర్వ వచ్చునే

(॥॥)
కొమ్మతలపోఁతలేడ కోవిలకూఁ తలేడ
నిమ్మలపుమనసేడ నివ్వెరగేడ
పమ్ముకొన్నసిగ్గులేడ పట్టరానితమి యేడ
ఇమ్ముల నిట్టివలపు లెట్టోర్వవచ్చునే

(॥॥)
కలయవేడుకలేడ కంతునిబాణములేడ
నెలకొన్న యాసలేడ నిట్టూర్పులేడ
చెలిచక్కఁ దనమేడ చెక్కిటిచేయిచింతలేడ
ఇల నిట్టివలపులు యెట్టోర్వవచ్చునే

(॥॥)
మంతనాన నుండిటేడ మలయుకోరికలేడ
సంతసపుమాటలేడ జాగులేడ
ఇంతలో శ్రీవేంటేశుఁ డిట్టె వచ్చి యాకె నేలె
యెంతయినా నీవలపు లెట్టోర్వవచ్చునే

(||pallavi||)
tāne yĕṟum̐gum̐ badi talam̐piṁchare
yī nĕlam̐ta meludāya nĕṭṭorva vachchune

(||||)
kŏmmadalabom̐taleḍa kovilagūm̐ taleḍa
nimmalabumanaseḍa nivvĕrageḍa
pammugŏnnasigguleḍa paṭṭarānidami yeḍa
immula niṭṭivalabu lĕṭṭorvavachchune

(||||)
kalayaveḍugaleḍa kaṁtunibāṇamuleḍa
nĕlagŏnna yāsaleḍa niṭṭūrbuleḍa
sĕlisakkam̐ danameḍa sĕkkiḍiseyisiṁtaleḍa
ila niṭṭivalabulu yĕṭṭorvavachchune

(||||)
maṁtanāna nuṁḍiḍeḍa malayugorigaleḍa
saṁtasabumāḍaleḍa jāguleḍa
iṁtalo śhrīveṁṭeśhum̐ ḍiṭṭĕ vachchi yāgĕ nelĕ
yĕṁtayinā nīvalabu lĕṭṭorvavachchune