Taane yeṟumgu naa tanuve yeṟumgunu

తానే యెఱుఁగు నా తనువే యెఱుఁగును
Language

(॥పల్లవి॥)
తానే యెఱుఁగు నా తనువే యెఱుఁగును
వీనులారఁ దనతో నే విన్నవించేదేమే

(॥తానే॥)
ముంచినది విరహము మోచినది జవ్వనము
చుంచునఁ బతి నేమని సొలసేనే
వంచినది నాశిరసు వాడినది నామోము
యెంచఁగ నామే నిట్లయ్యీ నెందుకు వగతునే

(॥తానే॥)
పుట్టినది తమకము వూఁచినవి పులకలు
యిట్టే తనకుఁగానే యేమి సేసేనే
తొట్టినది కన్నీరు తోఁచినది నివ్వెరగు
చిట్టికాలు చెలిచేతఁ జెప్పిపంపే దేమే

(॥తానే॥)
చెమరించేవి చెక్కులు చెదరేది నాతురము
అమరించి తనతో నే ననఁగా నేమే
అమలుఁడు శ్రీవేంకటాద్రీశుఁడిటు గూడె
సముకాన సణఁగులు చల్లే దిదేమే

(||pallavi||)
tāne yĕṟum̐gu nā tanuve yĕṟum̐gunu
vīnulāram̐ danado ne vinnaviṁchedeme

(||tāne||)
muṁchinadi virahamu mosinadi javvanamu
suṁchunam̐ badi nemani sŏlasene
vaṁchinadi nāśhirasu vāḍinadi nāmomu
yĕṁcham̐ga nāme niṭlayyī nĕṁdugu vagadune

(||tāne||)
puṭṭinadi tamagamu vūm̐sinavi pulagalu
yiṭṭe tanagum̐gāne yemi sesene
tŏṭṭinadi kannīru tom̐sinadi nivvĕragu
siṭṭigālu sĕlisedam̐ jĕppibaṁpe deme

(||tāne||)
sĕmariṁchevi sĕkkulu sĕdaredi nāduramu
amariṁchi tanado ne nanam̐gā neme
amalum̐ḍu śhrīveṁkaḍādrīśhum̐ḍiḍu gūḍĕ
samugāna saṇam̐gulu salle dideme