(॥పల్లవి॥)
తానె యెరఁగఁదా తన లాగు
మోనాన నే నొక్కమారు మొక్కితేనె చాలునే
(॥తానె॥)
పిలువ నేర్చినవాఁడు ప్రియము చెప్ప నేరఁడా
వెలిని లోనను విన్నవించ నోపనే
తలఁపు దెలిసేవాఁడు తమకించ నేరఁడా
పలుమారు నతనిఁ జేయి వట్టి తియ్య నోపనే
(॥తానె॥)
ఆయము అంటినవాఁడు అవ్వలిపని నేరఁడా
రేయిఁ బగలు నాతని రేఁచ నోపనే
చాయగా నవ్వినవాఁడు చవి గోన నేరఁడా
పాయపురచన లెల్ల బచరించ నోపనే
(॥తానె॥)
కన్నుల జూచినవాఁడు కాఁగిలించ నేరఁడా
వున్నతపుగుబ్బల నే నొత్త నోపనే
యిన్నిటా శ్రీవెంకటేశుఁ డిట్టె నన్నుఁ గూడెను
వెన్నెలబాయిట నంత వేసరించ నోపనే
(||pallavi||)
tānĕ yĕram̐gam̐dā tana lāgu
monāna ne nŏkkamāru mŏkkidenĕ sālune
(||tānĕ||)
piluva nersinavām̐ḍu priyamu sĕppa neram̐ḍā
vĕlini lonanu vinnaviṁcha nobane
talam̐pu dĕlisevām̐ḍu tamagiṁcha neram̐ḍā
palumāru nadanim̐ jeyi vaṭṭi tiyya nobane
(||tānĕ||)
āyamu aṁṭinavām̐ḍu avvalibani neram̐ḍā
reyim̐ bagalu nādani rem̐sa nobane
sāyagā navvinavām̐ḍu savi gona neram̐ḍā
pāyaburasana lĕlla basariṁcha nobane
(||tānĕ||)
kannula jūsinavām̐ḍu kām̐giliṁcha neram̐ḍā
vunnadabugubbala ne nŏtta nobane
yinniḍā śhrīvĕṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕnu
vĕnnĕlabāyiḍa naṁta vesariṁcha nobane