తానే యెఱఁగఁడా తగినజాణఁ డతఁడు
(॥పల్లవి॥)
తానే యెఱఁగఁడా తగినజాణఁ డతఁడు
మానిని నిను మన్నించె మన్ననలే చాలదా
(॥తానే॥)
మట్టులేని మాటలేల మందెమేల మింతయేల
గుట్టుతో నవ్వుటే మంచిగుణముగాదా
చిట్టంబుఁజెనకులేల సిగ్గువడి వుండనేల
వొట్టినమోహము తోడ నుస్సురంటెఁ జాలదా
(॥తానే॥)
కానికానివొట్లేల కాఁకలఁ బొరలనేల
మౌనముతో నుండుటే మంచిదిగాదా
పానుపుపై నిద్దురేలపైఁ గలవరింపేల
పూనిన జాగరముల పొద్దువోకే చాలదా
(॥తానే॥)
యిందాఁకా బింకమేల యిటు పంతమియ్యనేల
పొంది మేనుమరచుటే బుద్దిగాదా
అందపు శ్రీవేంకటేశుఁ డంతలోనె నిన్నుఁ గూడె
గొందినే మేని చెమటే గురితిది చాలదా
(||pallavi||)
tāne yĕṟam̐gam̐ḍā taginajāṇam̐ ḍadam̐ḍu
mānini ninu manniṁchĕ mannanale sāladā
(||tāne||)
maṭṭuleni māḍalela maṁdĕmela miṁtayela
guṭṭudo navvuḍe maṁchiguṇamugādā
siṭṭaṁbum̐jĕnagulela sigguvaḍi vuṁḍanela
vŏṭṭinamohamu toḍa nussuraṁṭĕm̐ jāladā
(||tāne||)
kānigānivŏṭlela kām̐kalam̐ bŏralanela
maunamudo nuṁḍuḍe maṁchidigādā
pānububai niddurelabaim̐ galavariṁpela
pūnina jāgaramula pŏdduvoge sāladā
(||tāne||)
yiṁdām̐kā biṁkamela yiḍu paṁtamiyyanela
pŏṁdi menumarasuḍe buddigādā
aṁdabu śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalonĕ ninnum̐ gūḍĕ
gŏṁdine meni sĕmaḍe gurididi sāladā