Taane vachchi ramanumdu dayadalamsude melu

తానే వచ్చి రమణుఁడు దయదలఁచుటే మేలు
Language

(॥పల్లవి॥)
తానే వచ్చి రమణుఁడు దయదలఁచుటే మేలు
నేనా తన కెదురు నేరుపు లేమున్నవే

(॥తానే॥)
ఆసలు ఘనమైతేను అట్టె ప్రియాలు చెప్పించు
వేసా లెక్కుడయితేను విఱ్ఱివీఁగించు
వాసులు మిక్కుటమైతే వట్టి యెగ్గులు వట్టించు
యీ సుద్దు లేమి చెప్పీనే యింతుల బతుకులు

(॥తానే॥)
చెలిమి వెగ్గళమైతే చేఁతలెల్లాఁ జేయించు
వలపులు దరచైతే వాడిక రేఁచు
పలుకులు దట్టమైతే పంతములెల్లా నిప్పించు
కలవెల్లా నిటులానే కాంతల బదుకులు

(॥తానే॥)
నగవు లధికమైతే ననుపులు వుట్టించు
మొగమోటలు మెఁడైతే మొక్కింపించు
తగ శ్రీవేంకటేశుఁ డితట నీడ నన్ను నేలె
జగములో నీడేరెనే సతుల బతుకులు

(||pallavi||)
tāne vachchi ramaṇum̐ḍu dayadalam̐suḍe melu
nenā tana kĕduru nerubu lemunnave

(||tāne||)
āsalu ghanamaidenu aṭṭĕ priyālu sĕppiṁchu
vesā lĕkkuḍayidenu viṭrivīm̐giṁchu
vāsulu mikkuḍamaide vaṭṭi yĕggulu vaṭṭiṁchu
yī suddu lemi sĕppīne yiṁtula badugulu

(||tāne||)
sĕlimi vĕggaḽamaide sem̐talĕllām̐ jeyiṁchu
valabulu darasaide vāḍiga rem̐su
palugulu daṭṭamaide paṁtamulĕllā nippiṁchu
kalavĕllā niḍulāne kāṁtala badugulu

(||tāne||)
nagavu ladhigamaide nanubulu vuṭṭiṁchu
mŏgamoḍalu mĕm̐ḍaide mŏkkiṁpiṁchu
taga śhrīveṁkaḍeśhum̐ ḍidaḍa nīḍa nannu nelĕ
jagamulo nīḍerĕne sadula badugulu