తానే వచ్చీఁగాక తరవులు వెట్టనేల
(॥పల్లవి॥)
తానే వచ్చీఁగాక తరవులు వెట్టనేల
కానుకలు మీచేనంపి కక్కసించవలెనా
(॥తానే॥)
తలఁపులం బారితేనే తనువులు సోఁకినట్టు
అలయించి యతనిమే నంటవలెనా
చెలిమిసేసితేనే చేతికిలోనైనట్టు
చెలులచే రమ్మని చెప్పించవలెనా
(॥తానే॥)
కమ్మి సుద్దులు వింటేనే కాఁగిలించుకొన్నట్టు
సమ్మతిచేసి చేతులు చాఁచవలెనా
పిమ్మటఁ బేరుకొంటేనే ప్రేమం దనివైనట్టు
రమ్మని పిలిపించి రతిసేయవలెనా
(॥తానే॥)
యీడకు విచ్చేసితేనే యెడవాయకుండినట్టు
జోడైయుండ నొడఁబఱచుకోవలెనా
కూడె శ్రీవేంకటేశుఁ డిక్కున నలమేల్మంగను
జాడతోడ తనమోవి చవిచూపవలెనా
(||pallavi||)
tāne vachchīm̐gāga taravulu vĕṭṭanela
kānugalu mīsenaṁpi kakkasiṁchavalĕnā
(||tāne||)
talam̐pulaṁ bāridene tanuvulu som̐kinaṭṭu
alayiṁchi yadanime naṁṭavalĕnā
sĕlimisesidene sedigilonainaṭṭu
sĕlulase rammani sĕppiṁchavalĕnā
(||tāne||)
kammi suddulu viṁṭene kām̐giliṁchugŏnnaṭṭu
sammadisesi sedulu sām̐savalĕnā
pimmaḍam̐ berugŏṁṭene premaṁ danivainaṭṭu
rammani pilibiṁchi radiseyavalĕnā
(||tāne||)
yīḍagu vichchesidene yĕḍavāyaguṁḍinaṭṭu
joḍaiyuṁḍa nŏḍam̐baṟasugovalĕnā
kūḍĕ śhrīveṁkaḍeśhum̐ ḍikkuna nalamelmaṁganu
jāḍadoḍa tanamovi savisūbavalĕnā