Taane vachcheegaani taravulu vettagure

తానే వచ్చీగాని తరవులు వెట్టకురే
Language

(॥పల్లవి॥)
తానే వచ్చీగాని తరవులు వెట్టకురే
మోనమునఁ జెలులాల మొక్కరే మీరు

(॥॥)
మనసు వచ్చినసతి మరి దవ్వుల నుండినా
తనువు సోకినట్ల తలఁచుఁ బతి
యెనయికయైన మాట యెక్కడనాడినాను
అనిశముఁ జెవిలోనే ఆడినట్టే వినును

(॥॥)
యిచ్చకపు జవరాలు యెదుటికి రాకుండినా
పచ్చిగా మఱపు లేక భావించును
బచ్చెన సిగ్గుల తోడఁ బచ్చడము గప్పుకొన్నా
విచ్చి విచ్చి కన్నులను వేమారుఁ జూచును

(॥॥)
మానావతియైనది మఱఁగున నుండినాను
పూని వచ్చి కౌఁగిటఁ బొంచి కూడును
యే నలమేలుమంగను యీతఁడు శ్రీవేంకటేశుఁ
డానుకొని నన్ను నేలే నన్నిటాను మెచ్చును

(||pallavi||)
tāne vachchīgāni taravulu vĕṭṭagure
monamunam̐ jĕlulāla mŏkkare mīru

(||||)
manasu vachchinasadi mari davvula nuṁḍinā
tanuvu soginaṭla talam̐sum̐ badi
yĕnayigayaina māḍa yĕkkaḍanāḍinānu
aniśhamum̐ jĕvilone āḍinaṭṭe vinunu

(||||)
yichchagabu javarālu yĕduḍigi rāguṁḍinā
pachchigā maṟabu lega bhāviṁchunu
bachchĕna siggula toḍam̐ bachchaḍamu gappugŏnnā
vichchi vichchi kannulanu vemārum̐ jūsunu

(||||)
mānāvadiyainadi maṟam̐guna nuṁḍinānu
pūni vachchi kaum̐giḍam̐ bŏṁchi kūḍunu
ye nalamelumaṁganu yīdam̐ḍu śhrīveṁkaḍeśhum̐
ḍānugŏni nannu nele nanniḍānu mĕchchunu