Taane tereemgaani taravaadibanulellaa

తానే తేరీఁగాని తరవాతిపనులెల్లా
Language

(॥పల్లవి॥)
తానే తేరీఁగాని తరవాతిపనులెల్లా
వెూనము తోడుతనే వెూము చూపుమనవే

(॥॥)
సరసమాడఁగాఁ దన్ను సమ్మతిఁ జేకొందుఁ గాక
గరిమలఁ బెనఁగుచుఁ గాదనేనా
మరిగితి నెన్నిమాట లాడించీనే
మురిపెపుఁ జూపులను మోము చూపు మనవే

(॥॥)
నగవులు నగఁ గాను నంటున మొక్కుదు గాక
వెగటులు వచరించ వింతదాననా
అగడున నెంతేసియాసలు రేఁచీనే
మొగి విచ్చక మన్నించి మోము చూపుమనవే

(॥॥)
మాటలు తానాడఁ గాను మక్కువఁ గూడుదుఁ గాక
చీటికిమాటికిఁ గొచ్చి సిగ్గురేఁచేనా
యీటున శ్రీ వేంకటేశుఁ డేలెఁ గతలేమిటికే
మూటవలపుల నాకు మోము చూపుమనవే

(||pallavi||)
tāne terīm̐gāni taravādibanulĕllā
vĕూnamu toḍudane vĕూmu sūbumanave

(||||)
sarasamāḍam̐gām̐ dannu sammadim̐ jegŏṁdum̐ gāga
garimalam̐ bĕnam̐gusum̐ gādanenā
marigidi nĕnnimāḍa lāḍiṁchīne
muribĕbum̐ jūbulanu momu sūbu manave

(||||)
nagavulu nagam̐ gānu naṁṭuna mŏkkudu gāga
vĕgaḍulu vasariṁcha viṁtadānanā
agaḍuna nĕṁtesiyāsalu rem̐sīne
mŏgi vichchaga manniṁchi momu sūbumanave

(||||)
māḍalu tānāḍam̐ gānu makkuvam̐ gūḍudum̐ gāga
sīḍigimāḍigim̐ gŏchchi siggurem̐senā
yīḍuna śhrī veṁkaḍeśhum̐ ḍelĕm̐ gadalemiḍige
mūḍavalabula nāgu momu sūbumanave