Taane telusugoneem daruni laagu

తానే తెలుసుకొనీఁ దరుణి లాగు
Language

(॥పల్లవి॥)
తానే తెలుసుకొనీఁ దరుణి లాగు
వీనులలో మనమిట్టె విన్నవించవలెనా

(॥తానే॥)
చనవుగలదానికి సరసములాడఁజెల్లు
ననుపుగలదానికినవ్వఁ జెల్లు
వినయపుదానికి వేడుకలెలాఁజెల్లు
మనమేలే యాతనిమర్మము లెత్తఁగను

(॥తానే॥)
మందెమేళపుదానికి మారుకొనివుండఁజెల్లు
అందగారిదానికి పై యాడఁ జెల్లును
పొందుచేసిన దానికి పొగడఁగఁ జెల్లును
మందలించి మన మిట్టె మనుపఁగ వచ్చునా

(॥తానే॥)
పాయరానిదానికి పంతములాడఁజెల్లు
మాయదారిదానికి మలయఁజెల్లు
యీయెడ శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁగూడె
వేయైనా మనమిఁక విడిపించగలమా

(||pallavi||)
tāne tĕlusugŏnīm̐ daruṇi lāgu
vīnulalo manamiṭṭĕ vinnaviṁchavalĕnā

(||tāne||)
sanavugaladānigi sarasamulāḍam̐jĕllu
nanubugaladāniginavvam̐ jĕllu
vinayabudānigi veḍugalĕlām̐jĕllu
manamele yādanimarmamu lĕttam̐ganu

(||tāne||)
maṁdĕmeḽabudānigi mārugŏnivuṁḍam̐jĕllu
aṁdagāridānigi pai yāḍam̐ jĕllunu
pŏṁdusesina dānigi pŏgaḍam̐gam̐ jĕllunu
maṁdaliṁchi mana miṭṭĕ manubam̐ga vachchunā

(||tāne||)
pāyarānidānigi paṁtamulāḍam̐jĕllu
māyadāridānigi malayam̐jĕllu
yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐gūḍĕ
veyainā manamim̐ka viḍibiṁchagalamā