తానే సిగ్గువడఁగ తప్పు లెందుఁ బట్టుదునే
(॥పల్లవి॥)
తానే సిగ్గువడఁగ తప్పు లెందుఁ బట్టుదునే
కానీవే అన్నిటా తారుకాణకు గురెవ్వరే
(॥తానే॥)
చిక్కనినవ్వులతోడ శిరసు దా వంచఁగాను
యెక్కువమదనముద్ర లెందువోవునే
ముక్కుమీఁది వేలితోడ మోసముతో నుండఁగాను
మక్కువ నామాఁటకు మాటాడేవారెవ్వరే
(॥తానే॥)
చిరుగుఁగెమ్మోవితోడ చెక్కునఁ జేయిడుకోఁగా
అగడుగా నాతోఁ బెండ్లాడే దెప్పుడే
మొగము చూచి తాను మొక్కులు దా మొక్కఁగాను
మొగమాట తిట్లెల్ల మోఁచే దెక్కడనే
(॥తానే॥)
నంటుసేసుకొని తాను నన్నుఁ గాగిలించుకోఁగా
వుంటనింట మరువా ట్లొడ్డేదెపుడే
దంట శ్రీవేంకటేశుడు తానే వచ్చి నన్నుఁ గూడె
బంట పంతములెల్లానుఁ బచరించే దెప్పుడే
(||pallavi||)
tāne sigguvaḍam̐ga tappu lĕṁdum̐ baṭṭudune
kānīve anniḍā tārugāṇagu gurĕvvare
(||tāne||)
sikkaninavvuladoḍa śhirasu dā vaṁcham̐gānu
yĕkkuvamadanamudra lĕṁduvovune
mukkumīm̐di velidoḍa mosamudo nuṁḍam̐gānu
makkuva nāmām̐ṭagu māḍāḍevārĕvvare
(||tāne||)
sirugum̐gĕmmovidoḍa sĕkkunam̐ jeyiḍugom̐gā
agaḍugā nādom̐ bĕṁḍlāḍe dĕppuḍe
mŏgamu sūsi tānu mŏkkulu dā mŏkkam̐gānu
mŏgamāḍa tiṭlĕlla mom̐se dĕkkaḍane
(||tāne||)
naṁṭusesugŏni tānu nannum̐ gāgiliṁchugom̐gā
vuṁṭaniṁṭa maruvā ṭlŏḍḍedĕbuḍe
daṁṭa śhrīveṁkaḍeśhuḍu tāne vachchi nannum̐ gūḍĕ
baṁṭa paṁtamulĕllānum̐ basariṁche dĕppuḍe