తానే నాకు రమణుఁడు తనకు నే దేవులను
(॥పల్లవి॥)
తానే నాకు రమణుఁడు తనకు నే దేవులను
పూని యెగ్గు పట్టవద్దు పొద్దున రమ్మనరే
(॥॥)
చలపట్ట వద్దు గాని చనవు చేసుకొని
చెలు లెంత గొసరినాఁ జెల్లు ననరే
అలుగఁగవద్దు గాని ఆసపడ్డవారలు
చెలఁగి యేమి సేసినాఁజెల్లు ననరే
(॥॥)
పంత మాడ వద్దు గాని భావించి వలపుల
చింత తో జంకించినానుఁ జెల్లు ననరే
వింత సేయవద్దు గాని వేడుకతోఁ గొనగోర
చెంతల నెంత వొత్తినాఁ జెల్లు ననరే
(॥॥)
బిగియఁగవద్దు గాని పెనఁగి కూడే వేళ
జిగి నెంత మీఱినానుఁ జెల్లు ననరే
నగి శ్రీ వేంకటేశుఁడు నన్ను నిటు వచ్చి కూడె
చిగురు మోవి యడుగఁ జెల్లు ననరే
(||pallavi||)
tāne nāgu ramaṇum̐ḍu tanagu ne devulanu
pūni yĕggu paṭṭavaddu pŏdduna rammanare
(||||)
salabaṭṭa vaddu gāni sanavu sesugŏni
sĕlu lĕṁta gŏsarinām̐ jĕllu nanare
alugam̐gavaddu gāni āsabaḍḍavāralu
sĕlam̐gi yemi sesinām̐jĕllu nanare
(||||)
paṁta māḍa vaddu gāni bhāviṁchi valabula
siṁta to jaṁkiṁchinānum̐ jĕllu nanare
viṁta seyavaddu gāni veḍugadom̐ gŏnagora
sĕṁtala nĕṁta vŏttinām̐ jĕllu nanare
(||||)
bigiyam̐gavaddu gāni pĕnam̐gi kūḍe veḽa
jigi nĕṁta mīṟinānum̐ jĕllu nanare
nagi śhrī veṁkaḍeśhum̐ḍu nannu niḍu vachchi kūḍĕ
siguru movi yaḍugam̐ jĕllu nanare