Taane naagu maada yichchem danasittamu

తానే నాకు మాట యిచ్చెఁ దనచిత్తము
Language

(॥పల్లవి॥)
తానే నాకు మాట యిచ్చెఁ దనచిత్తము
మోనముతో నలిగేనా ముద్దరాల నేను

(॥తానే॥)
మనసు వచ్చినాపెను మన్నించుమనవే
తనను వొద్దనేనా పంతమున నేను
ననిచి యెవ్వతెతోనైనా నవ్వుమనవె
పెనఁగి కోపగించేనా ప్రియురాల నేను

(॥తానే॥)
యేకాంతకైనాను యిచ్చక మాడుమనవే
కాకు సేసేనా తన్నుఁ గడవారితో
మేకుల కండసతిని మెచ్చు మెచ్చుమనవే
దీకొని వాదించేనా దేవులను నేను

(॥తానే॥)
వలసినవారిని వలపించుకొమ్మనవే
చలమునఁ గాదనేనా సారెకు నేను
అలమి శ్రీవేంటేశుఁ డాదరించి నన్నుఁగూడె
యెలమి నిఁక దూరేనా ఇల్లాల నేను

(||pallavi||)
tāne nāgu māḍa yichchĕm̐ danasittamu
monamudo naligenā muddarāla nenu

(||tāne||)
manasu vachchinābĕnu manniṁchumanave
tananu vŏddanenā paṁtamuna nenu
nanisi yĕvvadĕdonainā navvumanavĕ
pĕnam̐gi kobagiṁchenā priyurāla nenu

(||tāne||)
yegāṁtagainānu yichchaga māḍumanave
kāgu sesenā tannum̐ gaḍavārido
megula kaṁḍasadini mĕchchu mĕchchumanave
dīgŏni vādiṁchenā devulanu nenu

(||tāne||)
valasinavārini valabiṁchugŏmmanave
salamunam̐ gādanenā sārĕgu nenu
alami śhrīveṁṭeśhum̐ ḍādariṁchi nannum̐gūḍĕ
yĕlami nim̐ka dūrenā illāla nenu