తానే కాకెవ్వరు మాకు దాతయు దైవము తన
(॥పల్లవి॥)
తానే కాకెవ్వరు మాకు దాతయు దైవము తన-
లోనఁ బెట్టుకొని మాకు లోనైనవాఁడు
(॥తానే॥)
చదవించి, కూడవెట్టి, జారకుండ నిల్లుగట్టి
బెదురులేని బుద్ది పిన్ననాఁడే చెప్పి
యెదరి నడిగి, ద్రవ్యమిది గొమ్మనుచు నిచ్చి
పదిలమై తమ్ముఁ బాలించువాఁడు
(॥తానే॥)
మోహవియోగమ్ము, మొహానురాగమ్ము
దేహవిబాగంబు దెలిపిని కలికి
ఐహికమున వేంకటాధీశుఁడై సర్వ
దేహరక్షకుఁడై తిరుగుచున్నాఁడు
(||pallavi||)
tāne kāgĕvvaru māgu dādayu daivamu tana-
lonam̐ bĕṭṭugŏni māgu lonainavām̐ḍu
(||tāne||)
sadaviṁchi, kūḍavĕṭṭi, jāraguṁḍa nillugaṭṭi
bĕduruleni buddi pinnanām̐ḍe sĕppi
yĕdari naḍigi, dravyamidi gŏmmanusu nichchi
padilamai tammum̐ bāliṁchuvām̐ḍu
(||tāne||)
mohaviyogammu, mŏhānurāgammu
dehavibāgaṁbu dĕlibini kaligi
aihigamuna veṁkaḍādhīśhum̐ḍai sarva
deharakṣhagum̐ḍai tirugusunnām̐ḍu