తానైతే నన్నిటా నుత్తమగుణవంతుఁడు
(॥పల్లవి॥)
తానైతే నన్నిటా నుత్తమగుణవంతుఁడు
నేనెంతటిదానను నేరిచి పెనఁగను
(॥॥)
పలుకుల నెంతవొడఁబరచీనే తా నన్ను
చలముకొనిఁ తనతో సరిదాననా
యెలమిఁ దొడపైనేల ఇడుకొనీవే నన్ను
ఇలఁ దనకేమిచాఁతే ఇందరిలో నేను
(॥॥)
మన్నించి నాపైనెంత మచ్చికచల్లీనే తాను
తన్ను మెచ్చ సేవ సేసేదాననా నేను
చన్నులంటి నన్ను నెంత సరకు సేసి నవ్వీనే
కన్నులఁ జూడ నంతచక్కనిదానా
(॥॥)
చనవిచ్చి ననునెంత సమరతికి నీసీనే
ననిచిన మేనదాననా తనకు
చెనకి నన్నిట్టె కూడె శ్రీ వేంకటేశుడు తాను
వినయాల వేఁడుకొని విన్నవించనేర్తునా
(||pallavi||)
tānaide nanniḍā nuttamaguṇavaṁtum̐ḍu
nenĕṁtaḍidānanu nerisi pĕnam̐ganu
(||||)
palugula nĕṁtavŏḍam̐barasīne tā nannu
salamugŏnim̐ tanado saridānanā
yĕlamim̐ dŏḍabainela iḍugŏnīve nannu
ilam̐ danagemisām̐te iṁdarilo nenu
(||||)
manniṁchi nābainĕṁta machchigasallīne tānu
tannu mĕchcha seva sesedānanā nenu
sannulaṁṭi nannu nĕṁta saragu sesi navvīne
kannulam̐ jūḍa naṁtasakkanidānā
(||||)
sanavichchi nanunĕṁta samaradigi nīsīne
nanisina menadānanā tanagu
sĕnagi nanniṭṭĕ kūḍĕ śhrī veṁkaḍeśhuḍu tānu
vinayāla vem̐ḍugŏni vinnaviṁchanerdunā