Taanade nenide tadi vachche

తానదె నేనిదె తతి వచ్చె
Language

(॥పల్లవి॥)
తానదె నేనిదె తతి వచ్చె
నానిన సెలవుల నగవులు వలెనా

(॥తాన॥)
చెప్పినమాఁటకు చేసినచేఁతకు
చప్పనివలపులె సరి దాఁకె
ముప్పిరిఁ దనకే మొక్కే నేనిదె
అప్పటి నాతో నానలు వలెనా

(॥తాన॥)
యేచి వెనకటికి నిప్పటివునికికి
చూచినప్పుడే సూటేయ
చేచేతులఁ దనసేవలు నాకిదె
నాచోటికి నీనటనలు వలెనా

(॥తాన॥)
వేడుక పడుటకు వేఁడుకొనుటకును
కూడినప్పుడే గుఱుతాయ
యీడనె శ్రీవేంకటేశుఁడు తానేలె
ఆడికగా నిఁక ననుకొనవలెనా

(||pallavi||)
tānadĕ nenidĕ tadi vachchĕ
nānina sĕlavula nagavulu valĕnā

(||tāna||)
sĕppinamām̐ṭagu sesinasem̐tagu
sappanivalabulĕ sari dām̐kĕ
muppirim̐ danage mŏkke nenidĕ
appaḍi nādo nānalu valĕnā

(||tāna||)
yesi vĕnagaḍigi nippaḍivunigiki
sūsinappuḍe sūḍeya
sesedulam̐ danasevalu nāgidĕ
nāsoḍigi nīnaḍanalu valĕnā

(||tāna||)
veḍuga paḍuḍagu vem̐ḍugŏnuḍagunu
kūḍinappuḍe guṟudāya
yīḍanĕ śhrīveṁkaḍeśhum̐ḍu tānelĕ
āḍigagā nim̐ka nanugŏnavalĕnā