Taanada nenada tadavele

తానట నేనట తడవేలే
Language

(॥పల్లవి॥)
తానట నేనట తడవేలే
పూనికె చెల్లెను బుద్దు లిఁకేలే

(॥తాన॥)
నలుగడ నాతో నవ్వెడివాఁడట
మలసి చెక్కు చెయిమఱఁగేలే
చిలుకులగోళ్లఁ జెనకేటివాఁడట
వెలుపలిలోపలివెలితేలే

(॥తాన॥)
సూటిగ నాదెస చూచినవాఁడట
చీటికిమాటికి సిగ్గేలే
వీటికిఁ దా నిటు విచ్చేసినాఁడట
నీటున వాకిట నిలువఁగనేలే

(॥తాన॥)
గుట్టున సమరతిఁ గూడినవాఁడట
పట్టి వూర్పు లణఁపఁగనేలే
యిట్టె శ్రీవేంకటేశుఁడు నాపయిఁ
బెట్టినశాసట పెనఁగఁగనేలే

(||pallavi||)
tānaḍa nenaḍa taḍavele
pūnigĕ sĕllĕnu buddu lim̐kele

(||tāna||)
nalugaḍa nādo navvĕḍivām̐ḍaḍa
malasi sĕkku sĕyimaṟam̐gele
silugulagoḽlam̐ jĕnageḍivām̐ḍaḍa
vĕlubalilobalivĕlidele

(||tāna||)
sūḍiga nādĕsa sūsinavām̐ḍaḍa
sīḍigimāḍigi siggele
vīḍigim̐ dā niḍu vichchesinām̐ḍaḍa
nīḍuna vāgiḍa niluvam̐ganele

(||tāna||)
guṭṭuna samaradim̐ gūḍinavām̐ḍaḍa
paṭṭi vūrbu laṇam̐pam̐ganele
yiṭṭĕ śhrīveṁkaḍeśhum̐ḍu nābayim̐
bĕṭṭinaśhāsaḍa pĕnam̐gam̐ganele