(॥పల్లవి॥)
తానట నన్నట తలఁచునటా
యీ నిజమంతము నెఱిఁగేఁగాక
(॥తాన॥)
పిలువనంపునట ప్రియుఁడట
చెలి నీవు ప్రియముసేతునట
పలుమాఁటల కిఁకఁ బనులేల నే
వలరాజువలస వచ్చేఁగాక
(॥తాన॥)
చేకొని యిట విచ్చేసునట తా
నాకయి వసమయి నడచునట
రాకకు నామతి రాయవునా
నీకొరకు వలపు నెఱపేఁగాక
(॥తాన॥)
శ్రీవేంకటగిరిచెలువఁడట
కావలెనని ననుఁ గలసెనట
యీవలనావల యిద్దరికి
పూవుఁబరిమళపుఁ బొందులెకాక
(||pallavi||)
tānaḍa nannaḍa talam̐sunaḍā
yī nijamaṁtamu nĕṟim̐gem̐gāga
(||tāna||)
piluvanaṁpunaḍa priyum̐ḍaḍa
sĕli nīvu priyamusedunaḍa
palumām̐ṭala kim̐kam̐ banulela ne
valarājuvalasa vachchem̐gāga
(||tāna||)
segŏni yiḍa vichchesunaḍa tā
nāgayi vasamayi naḍasunaḍa
rāgagu nāmadi rāyavunā
nīgŏragu valabu nĕṟabem̐gāga
(||tāna||)
śhrīveṁkaḍagirisĕluvam̐ḍaḍa
kāvalĕnani nanum̐ galasĕnaḍa
yīvalanāvala yiddarigi
pūvum̐barimaḽabum̐ bŏṁdulĕgāga