Taamum daa meramgaraa taravaadibanulu

తాముఁ దా మెరఁగరా తరవాతిపనులు
Language

(॥పల్లవి॥)
తాముఁ దా మెరఁగరా తరవాతిపనులు
దోమటి వారిబుద్దుల తోడనేలే ఇఁకను

(॥తాము॥)
ఇంతిమోము చూచి మోహ మీతనిపైఁ జల్లె నిదె
అంతలో నవ్వు లీతఁ డాపెపైఁ జల్లె
వింత లిద్దరికి లేవు వేడుకచెలుల మింతే
మంతనపు విన్నపాలు మనకేలే ఇఁకను

(॥తాము॥)
వెలఁది యీవిభునికి వీడెము చేతికిచ్చె
చెలువుఁ డాకుమడిని చెలికిచ్చెను
తలఁపు లిద్దరికిని తారుకాణలాయ నిదె
చలివాసె వేఁడుకొనుఁ సారేనేలే మనకు

(॥తాము॥)
అంగన శ్రీ వేంకటేశు నంకెలఁ గాఁగిలించె
సంగతి నాతఁడే కూడి చనవిచ్చెను
ఇంగితాన నిద్దరికి యెరవులు లేవిఁక
ముంగిటనున్న మనకు మొరఁగేలే యిఁకను

(||pallavi||)
tāmum̐ dā mĕram̐garā taravādibanulu
domaḍi vāribuddula toḍanele im̐kanu

(||tāmu||)
iṁtimomu sūsi moha mīdanibaim̐ jallĕ nidĕ
aṁtalo navvu līdam̐ ḍābĕbaim̐ jallĕ
viṁta liddarigi levu veḍugasĕlula miṁte
maṁtanabu vinnabālu managele im̐kanu

(||tāmu||)
vĕlam̐di yīvibhunigi vīḍĕmu sedigichchĕ
sĕluvum̐ ḍāgumaḍini sĕligichchĕnu
talam̐pu liddarigini tārugāṇalāya nidĕ
salivāsĕ vem̐ḍugŏnum̐ sārenele managu

(||tāmu||)
aṁgana śhrī veṁkaḍeśhu naṁkĕlam̐ gām̐giliṁchĕ
saṁgadi nādam̐ḍe kūḍi sanavichchĕnu
iṁgidāna niddarigi yĕravulu levim̐ka
muṁgiḍanunna managu mŏram̐gele yim̐kanu