తాము విన్న సుద్దులకు తారుకాణ వచ్చెనంటా
(॥పల్లవి॥)
తాము విన్న సుద్దులకు తారుకాణ వచ్చెనంటా
నాములుగా సెలవుల నవ్వులు నవ్వేరు
(॥తాము॥)
కామిని నీవద్దనుండి కనుసన్న సేసితేను
మోములు చూచుకొనేరు ముదితలెల్లా
ఆముకొని నీవంతలో నాకెపాదము దొక్కితే
దోమటిఁ దమలోనఁజేతులు చరచేరు
(॥తాము॥)
చెలి నీసముకమున సిగ్గులు నెరపితేను
తల లూఁచుకొనే రిదే తరుణు లెల్లా
మలసి యాకెను నీవు మర్మాలు సోఁక వాడితే
కులికి వొండొరు లిదె గోళ్ళ నెచ్చరించేరు
(॥తాము॥)
యింతి నీ చెవులలొను నేకతము లాడితేను
సంతోసాన మురిసేరు సతులెల్లాను
యింతిలో శ్రీవేంకటేశ యీకెను నీవు గూడితే
పంతము లొకరొకరు పచారించుకొనేరు
(||pallavi||)
tāmu vinna suddulagu tārugāṇa vachchĕnaṁṭā
nāmulugā sĕlavula navvulu navveru
(||tāmu||)
kāmini nīvaddanuṁḍi kanusanna sesidenu
momulu sūsugŏneru mudidalĕllā
āmugŏni nīvaṁtalo nāgĕbādamu dŏkkide
domaḍim̐ damalonam̐jedulu saraseru
(||tāmu||)
sĕli nīsamugamuna siggulu nĕrabidenu
tala lūm̐sugŏne ride taruṇu lĕllā
malasi yāgĕnu nīvu marmālu som̐ka vāḍide
kuligi vŏṁḍŏru lidĕ goḽḽa nĕchchariṁcheru
(||tāmu||)
yiṁti nī sĕvulalŏnu negadamu lāḍidenu
saṁtosāna muriseru sadulĕllānu
yiṁtilo śhrīveṁkaḍeśha yīgĕnu nīvu gūḍide
paṁtamu lŏgarŏgaru pasāriṁchugŏneru