Taamogari naaduduru tamaneraa lemchugoru

తామొకరి నాడుదురు తమనేరా లెంచుకోరు
Language

(॥పల్లవి॥)
తామొకరి నాడుదురు తమనేరా లెంచుకోరు
భూమిలో నిట్లఁ గాఁగానే పో కౌను సమసె

(॥తాము॥)
కాదనేటిదాననా కడు నీవు నవ్వితేను
సోదించి నీమోవి నీవే చూచుకోరాదా
యీదె నీభావ మయ్యా యెదుటిచందురుకందు
నాదించేకన్నులు తననలుపు లెంచీనా

(॥తాము॥)
వేసరేటిదాననా వెంగేలు నీ వాడితేను
యీసు నీగుణము నీవే యెంచుకోరాదా
మోసాన జలనిధిని మునినోరియెంగిలనే -
వూసివాసినోరు తనవొద్దియెంగి లెంచీనా

(॥తాము॥)
వంతుకెంచేదాననా వచ్చి నీవు గూడఁగాను
ఇంతలో నావరుస నీవెంచుకోరాదా
పంతపు శ్రీవేంకటేశ పైకొని కూడితి నన్ను
దొంతి తన నీడ తోడువాసి వుండునా

(||pallavi||)
tāmŏgari nāḍuduru tamanerā lĕṁchugoru
bhūmilo niṭlam̐ gām̐gāne po kaunu samasĕ

(||tāmu||)
kādaneḍidānanā kaḍu nīvu navvidenu
sodiṁchi nīmovi nīve sūsugorādā
yīdĕ nībhāva mayyā yĕduḍisaṁdurugaṁdu
nādiṁchegannulu tananalubu lĕṁchīnā

(||tāmu||)
vesareḍidānanā vĕṁgelu nī vāḍidenu
yīsu nīguṇamu nīve yĕṁchugorādā
mosāna jalanidhini muninoriyĕṁgilane -
vūsivāsinoru tanavŏddiyĕṁgi lĕṁchīnā

(||tāmu||)
vaṁtugĕṁchedānanā vachchi nīvu gūḍam̐gānu
iṁtalo nāvarusa nīvĕṁchugorādā
paṁtabu śhrīveṁkaḍeśha paigŏni kūḍidi nannu
dŏṁti tana nīḍa toḍuvāsi vuṁḍunā