తామేల వెంగేలాడేరు దవ్వులనుండి
(॥పల్లవి॥)
తామేల వెంగేలాడేరు దవ్వులనుండి
నా ముంజేత నీవు గట్టిన కంకణ మున్నది
(॥తామే॥)
నివ్వటిల్ల నాఁమీద నీ మోహము గలిగితే
యెవ్వతె యీసడించినా నేమౌను
నవ్వుతాఁ గైదండతోడ నన్ను నీవు చేపట్టితే
వువ్విళ్ళూరి సవతులువొద్దనఁగఁ గలరా
(॥తామే॥)
సేసవెట్టి నీవు నాకిచ్చిన చనవు గలిగితే
యేసతి పంతమాడినా నేమౌను
బాస యిచ్చి నీవు నాపైఁ బాదాలు చాఁచుకుండితే
వేసాల చెలు లీపొందు విడిపించఁ గలరా
(॥తామే॥)
కాతరాన నీవు నన్నుఁ గాఁగిలించుకుండఁగాను
యేతుల మాట్లాడుకొంటే నేమౌను
నీతితో శ్రీ వెంకటేశ నే నలమేలుమంగను
ఆతలీతలివార లౌఁగాదనఁ గలరా
(||pallavi||)
tāmela vĕṁgelāḍeru davvulanuṁḍi
nā muṁjeda nīvu gaṭṭina kaṁkaṇa munnadi
(||tāme||)
nivvaḍilla nām̐mīda nī mohamu galigide
yĕvvadĕ yīsaḍiṁchinā nemaunu
navvudām̐ gaidaṁḍadoḍa nannu nīvu sebaṭṭide
vuvviḽḽūri savaduluvŏddanam̐gam̐ galarā
(||tāme||)
sesavĕṭṭi nīvu nāgichchina sanavu galigide
yesadi paṁtamāḍinā nemaunu
bāsa yichchi nīvu nābaim̐ bādālu sām̐suguṁḍide
vesāla sĕlu lībŏṁdu viḍibiṁcham̐ galarā
(||tāme||)
kādarāna nīvu nannum̐ gām̐giliṁchuguṁḍam̐gānu
yedula māṭlāḍugŏṁṭe nemaunu
nīdido śhrī vĕṁkaḍeśha ne nalamelumaṁganu
ādalīdalivāra laum̐gādanam̐ galarā