తామే యెఱుఁగుదురు తమ పొందులు
(॥పల్లవి॥)
తామే యెఱుఁగుదురు తమ పొందులు
ప్రేమములు రేఁచితేను బెరయు వేడుకలు
(॥॥)
చెలినోరిలో మాట సిగ్గుల లోపలి తేట
తెలిపి చెప్పి చూపరే తెఱవలాల
పలు సతుల మగఁడు పరాకై వున్నాఁడేమో
తలపించరే మీరు తటుకన నిపుడూ
(॥॥)
పెద్ద కన్నులలో యాస పిడికిటి లోని సేస
పొద్దున నెఱిఁగించరే పొలఁతులాల
చద్దివేఁడి వలపుల సందడి నున్నాఁడేమో
బుద్ధిగా సన్నల నింపు వుట్టించరే
(॥॥)
అలమేల్మంగలో నవ్వు అరచేతిలోని పువ్వు
లలిఁ దారుకాణించరే లలనలాల
యిల శ్రీ వేంకటేశ్వరుఁ డియ్యకొని యున్నాఁడేమో
కలసె దొలుతే యింకాఁ గరుణ వుట్టించరే
(||pallavi||)
tāme yĕṟum̐guduru tama pŏṁdulu
premamulu rem̐sidenu bĕrayu veḍugalu
(||||)
sĕlinorilo māḍa siggula lobali teḍa
tĕlibi sĕppi sūbare tĕṟavalāla
palu sadula magam̐ḍu parāgai vunnām̐ḍemo
talabiṁchare mīru taḍugana nibuḍū
(||||)
pĕdda kannulalo yāsa piḍigiḍi loni sesa
pŏdduna nĕṟim̐giṁchare pŏlam̐tulāla
saddivem̐ḍi valabula saṁdaḍi nunnām̐ḍemo
buddhigā sannala niṁpu vuṭṭiṁchare
(||||)
alamelmaṁgalo navvu arasediloni puvvu
lalim̐ dārugāṇiṁchare lalanalāla
yila śhrī veṁkaḍeśhvarum̐ ḍiyyagŏni yunnām̐ḍemo
kalasĕ dŏlude yiṁkām̐ garuṇa vuṭṭiṁchare