తామె యెఱుగుదురు తమతమ భావము
(॥పల్లవి॥)
తామె యెఱుగుదురు తమతమ భావము
చే ముంచి యెవ్వరికిని చెప్పఁ జూపరాదు
(॥తామె॥)
మంతనపు పతిమాట మనసునఁ దలఁచుక
చింతించి చింతించి తానే సెలవి నవ్వె
వింత లీచెలివి చూచి వెరగయ్యీ నీవేళ
అంతరంగములోపను లవి యెటువంటివో
(॥తామె॥)
కన్నుల జేసిన సన్నకాయమున మెరమంగ
తన్నుఁ దానే పులకించి తలయూఁచీని
అన్నిటా నేమిందుకే ఆయములు గరఁగేము
మున్నీటి వొఁడబాట్ల ముచ్చట లెట్టివో
(॥తామె॥)
దగ్గర వచ్చిన మేలు తమకాన బోరుగఁగా
సిగ్గుతోడ గొంకికొంకి చేయివట్టెను
అగ్గమై శ్రీవేంకటేశు డంగన గూడె మెచ్చితి-
మెగ్గుదప్పులేనితమయెనయిక లెట్టివో
(||pallavi||)
tāmĕ yĕṟuguduru tamadama bhāvamu
se muṁchi yĕvvarigini sĕppam̐ jūbarādu
(||tāmĕ||)
maṁtanabu padimāḍa manasunam̐ dalam̐suga
siṁtiṁchi siṁtiṁchi tāne sĕlavi navvĕ
viṁta līsĕlivi sūsi vĕragayyī nīveḽa
aṁtaraṁgamulobanu lavi yĕḍuvaṁṭivo
(||tāmĕ||)
kannula jesina sannagāyamuna mĕramaṁga
tannum̐ dāne pulagiṁchi talayūm̐sīni
anniḍā nemiṁduge āyamulu garam̐gemu
munnīḍi vŏm̐ḍabāṭla muchchaḍa lĕṭṭivo
(||tāmĕ||)
daggara vachchina melu tamagāna borugam̐gā
siggudoḍa gŏṁkigŏṁki seyivaṭṭĕnu
aggamai śhrīveṁkaḍeśhu ḍaṁgana gūḍĕ mĕchchidi-
mĕggudappulenidamayĕnayiga lĕṭṭivo