Taamasimcham baniledu tagavu lemchugomtenu

తామసించఁ బనిలేదు తగవు లెంచుకొంటేను
Language

(॥పల్లవి॥)
తామసించఁ బనిలేదు తగవు లెంచుకొంటేను
ప్రేమము దెలుసుకొని బెరయుట గాకా

(॥॥)
విన్నపమేమి సేసేము వేగినంతా నింటికాడ
కన్నె నీవు వచ్చేవంటాఁ గాచు కున్నది
సన్నల నీ కెంతని చవులు వుట్టించేము
మన్నించి యింతిఁ గూడేదే మాట యింతే కాకా

(॥॥)
కాను కెందాఁకా నిచ్చేము కమ్మటిఁ గమ్మటి నీకు
పానుపు పైని యాస పట్టు కున్నది
నానా రీతుల నిన్ను నమ్మిక లే మడిగేము
మానినిఁ గరుణించేదే మంచి దింతే కాకా

(॥॥)
యిందు కెంత పొగడేము యిట్టే నీవే రాఁ గా
ముందే యాపె సంతోసమున నున్నది
కందువ నేలితి వీకెఁ గని శ్రీ వేంకటేశ్వర
పొందు పాయకుండేదే బుద్ధి యింతే కాకా

(||pallavi||)
tāmasiṁcham̐ baniledu tagavu lĕṁchugŏṁṭenu
premamu dĕlusugŏni bĕrayuḍa gāgā

(||||)
vinnabamemi sesemu veginaṁtā niṁṭigāḍa
kannĕ nīvu vachchevaṁṭām̐ gāsu kunnadi
sannala nī kĕṁtani savulu vuṭṭiṁchemu
manniṁchi yiṁtim̐ gūḍede māḍa yiṁte kāgā

(||||)
kānu kĕṁdām̐kā nichchemu kammaḍim̐ gammaḍi nīgu
pānubu paini yāsa paṭṭu kunnadi
nānā rīdula ninnu nammiga le maḍigemu
māninim̐ garuṇiṁchede maṁchi diṁte kāgā

(||||)
yiṁdu kĕṁta pŏgaḍemu yiṭṭe nīve rām̐ gā
muṁde yābĕ saṁtosamuna nunnadi
kaṁduva nelidi vīgĕm̐ gani śhrī veṁkaḍeśhvara
pŏṁdu pāyaguṁḍede buddhi yiṁte kāgā