తాఁ గలడు నాకు యేమీఁ దడవలెను
(॥పల్లవి॥)
తాఁ గలడు నాకు యేమీఁ దడవలెను
చేఁగదేరె మనసెల్లా చెప్పి చూపునేఁటికి
(॥తాఁగల॥)
యెలయించవద్దుగాని యెట్లైనా నుండుమనవే
వలతుఁ గనక యిఁక వద్దన నేను
తొలుతనే యెరుఁగుదు దూరితే వెరవఁడు
చలివాసి తిరిగీని చండిపార నోపను
(॥తాఁగల॥)
యీడు వెట్ట వద్దుగాని యెవ్వతెనైనాఁ దేనీవే
ఆడుకోఁగాఁ దనవోజ లట్టె మానీనా
ఆడనే గడుసు పడె నలయించఁగా నేమి
కూడి వుండినచోటను కోపగించఁ దగదు
(॥తాఁగల॥)
యెడయఁగ వద్దుగాని యెప్పుడైనాఁ గూడనీలే
విడువరానియెడకు విసువేఁటికి
అడరి శ్రీవెంటేశుఁ డలమేల్‌మంగను నేను
కడలేక నన్ను నేలె కన్నుల మొక్కేను
(||pallavi||)
tām̐ galaḍu nāgu yemīm̐ daḍavalĕnu
sem̐gaderĕ manasĕllā sĕppi sūbunem̐ṭigi
(||tām̐gala||)
yĕlayiṁchavaddugāni yĕṭlainā nuṁḍumanave
valadum̐ ganaga yim̐ka vaddana nenu
tŏludane yĕrum̐gudu dūride vĕravam̐ḍu
salivāsi tirigīni saṁḍibāra nobanu
(||tām̐gala||)
yīḍu vĕṭṭa vaddugāni yĕvvadĕnainām̐ denīve
āḍugom̐gām̐ danavoja laṭṭĕ mānīnā
āḍane gaḍusu paḍĕ nalayiṁcham̐gā nemi
kūḍi vuṁḍinasoḍanu kobagiṁcham̐ dagadu
(||tām̐gala||)
yĕḍayam̐ga vaddugāni yĕppuḍainām̐ gūḍanīle
viḍuvarāniyĕḍagu visuvem̐ṭigi
aḍari śhrīvĕṁṭeśhum̐ ḍalamelmaṁganu nenu
kaḍalega nannu nelĕ kannula mŏkkenu