తాలిమి చక్కన గాని తమక మెం తైనాఁ గద్దు
(॥పల్లవి॥)
తాలిమి చక్కన గాని తమక మెం తైనాఁ గద్దు
మేల మాడవయ్య చెలి మీఁద మీఁద నున్నది
(॥తాలిమి॥)
వనితి పువ్వులవేసి వలపు నీపైఁ బూసి
తనుఁ దానె సిగ్గుపడి తల వంచీని
మనసు నీపై బెట్టి మాఁటలు మాతో నాడీ
పెనఁగి పిలువవయ్య పేరుకొని నీవు
(॥తాలిమి॥)
పడఁతి నీతో నవ్వి పాయపుటాసలు దవ్వి
చిడుముడి సిగ్గుతోడఁ జెమరించీని
కడు నిన్నట్టె చూచి కాయము మాపై వేసీ
వొడి వట్టి తియ్యవయ్య వొద్దికతో నీవు
(॥తాలిమి॥)
కలికి నీకాలు దొక్కి కమ్మటి నీకు మొక్కి
వలవనిసిగ్గుతోడ వడఁ బడీని
నెల వై శ్రీవెంకటేశ నిన్నుఁ గూడె తన్నుఁ దానె
అలమి పైకొన వయ్య అప్పటివి నీవు
(||pallavi||)
tālimi sakkana gāni tamaga mĕṁ tainām̐ gaddu
mela māḍavayya sĕli mīm̐da mīm̐da nunnadi
(||tālimi||)
vanidi puvvulavesi valabu nībaim̐ būsi
tanum̐ dānĕ siggubaḍi tala vaṁchīni
manasu nībai bĕṭṭi mām̐ṭalu mādo nāḍī
pĕnam̐gi piluvavayya perugŏni nīvu
(||tālimi||)
paḍam̐ti nīdo navvi pāyabuḍāsalu davvi
siḍumuḍi siggudoḍam̐ jĕmariṁchīni
kaḍu ninnaṭṭĕ sūsi kāyamu mābai vesī
vŏḍi vaṭṭi tiyyavayya vŏddigado nīvu
(||tālimi||)
kaligi nīgālu dŏkki kammaḍi nīgu mŏkki
valavanisiggudoḍa vaḍam̐ baḍīni
nĕla vai śhrīvĕṁkaḍeśha ninnum̐ gūḍĕ tannum̐ dānĕ
alami paigŏna vayya appaḍivi nīvu