Taa noorage yaa panulu dadaveem gaaga

తా నూరకే యా పనులు దడవీఁ గాక
Language

(॥పల్లవి॥)
తా నూరకే యా పనులు దడవీఁ గాక
నేనేమైనాఁ దనమీఁద నేరాలు వేసేనా

(॥తానూ॥)
యెట్టుండినా నమ్మక తన్నెగసక్కాలాడేనా
పెట్టరాని యానలేల పెట్టుకొనీనే
గుట్టుతోడఁ దలవంచుకొని వున్నదాన నేను
నట్టనడుమఁ దానేల నవ్వులు నవ్వీనే

(॥తానూ॥)
యెంతసేసినాఁ దనపై యిట్టే నిందలు మోపేనా
కాంతలఁ దెచ్చేల తారుకాణ సేసీనే
సంతోసాన నాలో నేనే సమ్మతించుకున్నదాన
చెంతనుండి మరి నేల సిగ్గులు వడీనే

(॥తానూ॥)
యేరీతి మెలఁగినాను యెగ్గుపట్టి దూరేనా
సారె నన్నే లొడఁబరచఁగ వచ్చీనే
కోరి శ్రీవేంకటేశుఁడు కూడినాఁడు దా నన్ను
గారవించి యాల యిచ్చకములు నెరపీనే

(||pallavi||)
tā nūrage yā panulu daḍavīm̐ gāga
nenemainām̐ danamīm̐da nerālu vesenā

(||tānū||)
yĕṭṭuṁḍinā nammaga tannĕgasakkālāḍenā
pĕṭṭarāni yānalela pĕṭṭugŏnīne
guṭṭudoḍam̐ dalavaṁchugŏni vunnadāna nenu
naṭṭanaḍumam̐ dānela navvulu navvīne

(||tānū||)
yĕṁtasesinām̐ danabai yiṭṭe niṁdalu mobenā
kāṁtalam̐ dĕchchela tārugāṇa sesīne
saṁtosāna nālo nene sammadiṁchugunnadāna
sĕṁtanuṁḍi mari nela siggulu vaḍīne

(||tānū||)
yerīdi mĕlam̐ginānu yĕggubaṭṭi dūrenā
sārĕ nanne lŏḍam̐barasam̐ga vachchīne
kori śhrīveṁkaḍeśhum̐ḍu kūḍinām̐ḍu dā nannu
gāraviṁchi yāla yichchagamulu nĕrabīne