Taa neramgamdadave yee taarugaanalellaanu

తా నెరఁగఁడటవే యీ తారుకాణలెల్లాను
Language

(॥పల్లవి॥)
తా నెరఁగఁడటవే యీ తారుకాణలెల్లాను
రానీవే కాదనేనా రమణుని నీడకు

(॥తానె॥)
తలఁపు సమ్మతించితే తనువు సమ్మతించును
వలపు గలిగితేనే వాడికె గలుగును
చలము విడువకున్న సాదించవచ్చుఁ బనులు
పలుకులు మంచివైతే పంతమును మంచిదే

(॥తానె॥)
తగులు దప్పకుండితే తమకముఁ దప్పదు
తెగువలు వుట్టితేను తెరఁకువాఁ బుట్టును
నగవులు నిండితేను నయము దోడన నిండు
తగవులు నిలిపితే తాలిములు నిలుచు

(॥తానె॥)
చెనకులు మొనపితే సిగ్గులును మొనపును
ననుపులు మిగిలితే నమ్మికలు మిగులును
యెనసి శ్రీవేంకటేశుఁ డీడకే తా విచ్చేసీ
చనవు సతమైతేనే సరసమూ సతము

(||pallavi||)
tā nĕram̐gam̐ḍaḍave yī tārugāṇalĕllānu
rānīve kādanenā ramaṇuni nīḍagu

(||tānĕ||)
talam̐pu sammadiṁchide tanuvu sammadiṁchunu
valabu galigidene vāḍigĕ galugunu
salamu viḍuvagunna sādiṁchavachchum̐ banulu
palugulu maṁchivaide paṁtamunu maṁchide

(||tānĕ||)
tagulu dappaguṁḍide tamagamum̐ dappadu
tĕguvalu vuṭṭidenu tĕram̐kuvām̐ buṭṭunu
nagavulu niṁḍidenu nayamu doḍana niṁḍu
tagavulu nilibide tālimulu nilusu

(||tānĕ||)
sĕnagulu mŏnabide siggulunu mŏnabunu
nanubulu migilide nammigalu migulunu
yĕnasi śhrīveṁkaḍeśhum̐ ḍīḍage tā vichchesī
sanavu sadamaidene sarasamū sadamu