Taa nemta seseno kaani tamagimtu nenaide

తా నెంత సేసెనో కాని తమకింతు నేనైతే
Language

(॥పల్లవి॥)
తా నెంత సేసెనో కాని తమకింతు నేనైతే
యీ నేరుపే ఆపెకు మీ రెచ్చరించవలదా

(॥తానెం॥)
అంతచేసినచేఁతకు అంగన విభునిఁ జూచి
చింతించి యేమనెనే చెప్పిరే మీరు
పంతమున నాబోఁట్టిడఁతి యైతే నిందుకు
మంతనానఁ బట్టి సదమదముగఁ జేసును

(॥తానెం॥)
రాతిరి రానియందుకు రమణి యాతనిమీఁద
ఘాతల నెం తలిగెనే కాఁకతోడను
యేతుల నిట్లాఁగనక యిచ్చోటికి రాకున్నా
కాతరాన నావంటిది కడమలు వాపును

(॥తానెం॥)
బలిమిఁ గూడినందుకు భామిని దా సిగ్గువడి
యెలమి శ్రీవేంకటేశు నెంత నవ్వెనే
అలరుచు నింతలోన ఆతఁడె నన్నుఁ గూడె
యిల నాగుణముదై తే నిన్నిటా మెప్పించును

(||pallavi||)
tā nĕṁta sesĕno kāni tamagiṁtu nenaide
yī nerube ābĕgu mī rĕchchariṁchavaladā

(||tānĕṁ||)
aṁtasesinasem̐tagu aṁgana vibhunim̐ jūsi
siṁtiṁchi yemanĕne sĕppire mīru
paṁtamuna nābom̐ṭṭiḍam̐ti yaide niṁdugu
maṁtanānam̐ baṭṭi sadamadamugam̐ jesunu

(||tānĕṁ||)
rādiri rāniyaṁdugu ramaṇi yādanimīm̐da
ghādala nĕṁ taligĕne kām̐kadoḍanu
yedula niṭlām̐ganaga yichchoḍigi rāgunnā
kādarāna nāvaṁṭidi kaḍamalu vābunu

(||tānĕṁ||)
balimim̐ gūḍinaṁdugu bhāmini dā sigguvaḍi
yĕlami śhrīveṁkaḍeśhu nĕṁta navvĕne
alarusu niṁtalona ādam̐ḍĕ nannum̐ gūḍĕ
yila nāguṇamudai te ninniḍā mĕppiṁchunu