Taa nemta nee vemta tagili tagili ninnum

తా నెంత నీ వెంత తగిలి తగిలి నిన్నుఁ
Language

(॥పల్లవి॥)
తా నెంత నీ వెంత తగిలి తగిలి నిన్నుఁ -
బూని వలపించి యీకె పొదలెఁ గదవయ్యా

(॥తానెంత॥)
చిడుముడిఁ వూడిగాలు సేసిసేసి యాపె నీకు
కడుఁ జనవరి యాయఁగదవయ్యా
నడుమ నూరక నీతో నవ్వి నవ్వి రాజసాన
వెడఁగుగర్వాన విఱవీఁగీఁ గదవయ్యా

(॥తానెంత॥)
మక్కళించి యాపె నీతో మాఁట లాడి యాడి నీకు
గక్కననుఁ జుట్టమాయఁ గదవయ్యా
చిక్కించుక కొలువులు సేసిసేసి నిలుచుండి
వెక్కసపుఁ బంతుములే వెలసెఁ గదవయ్యా

(॥తానెంత॥)
వొపికతోఁ జన్నుల నిన్నొత్తి యొత్తి యాపె నీకుఁ
గాఁపురాలు సేయ నేర్చెఁ గదవయ్యా
యేపున శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
నీ పొందులఁ దా నింటిలో నిలిచెఁ గదవయ్యా

(||pallavi||)
tā nĕṁta nī vĕṁta tagili tagili ninnum̐ -
būni valabiṁchi yīgĕ pŏdalĕm̐ gadavayyā

(||tānĕṁta||)
siḍumuḍim̐ vūḍigālu sesisesi yābĕ nīgu
kaḍum̐ janavari yāyam̐gadavayyā
naḍuma nūraga nīdo navvi navvi rājasāna
vĕḍam̐gugarvāna viṟavīm̐gīm̐ gadavayyā

(||tānĕṁta||)
makkaḽiṁchi yābĕ nīdo mām̐ṭa lāḍi yāḍi nīgu
gakkananum̐ juṭṭamāyam̐ gadavayyā
sikkiṁchuga kŏluvulu sesisesi nilusuṁḍi
vĕkkasabum̐ baṁtumule vĕlasĕm̐ gadavayyā

(||tānĕṁta||)
vŏbigadom̐ jannula ninnŏtti yŏtti yābĕ nīgum̐
gām̐purālu seya nersĕm̐ gadavayyā
yebuna śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
nī pŏṁdulam̐ dā niṁṭilo nilisĕm̐ gadavayyā