తా నెంత నే నెంత తగునా తాను
(॥పల్లవి॥)
తా నెంత నే నెంత తగునా తాను
తేనె వూసి మాటలను తేలించేఁ దానూ
(॥తా నెంత॥)
రమ్మనఁగా తనతో నే రా నంటినా నాకు
అమ్మరో ప్రియము చెప్పీ న దేమె తాను
కమ్మి సారెకు నలుగఁ గడదాననా
చిమ్ముచు నా కిచ్చకాలు సేయ నేలే తానూ
(॥తా నెంత॥)
చలమునఁ దన మాఁట జవదాఁటేనా
చెలులచేఁ జెప్పించీ చెల్లఁబో వీఁడు
చలిమి బలిమి నాతో సారెఁ జెల్లదా
వెలి న న్నొడఁబరచీ వెర పేలే తానూ
(॥తా నెంత॥)
యితరులవలెఁ దన్ను నెగ్గు లెంచేనా
అతివినయాలు చేసీ నౌనే తాను
యిత వై శ్రీవెంటేశుడిట్టె కూడెను
మతిలోని వెలుతులు మరి యాలే తానూ
(||pallavi||)
tā nĕṁta ne nĕṁta tagunā tānu
tenĕ vūsi māḍalanu teliṁchem̐ dānū
(||tā nĕṁta||)
rammanam̐gā tanado ne rā naṁṭinā nāgu
ammaro priyamu sĕppī na demĕ tānu
kammi sārĕgu nalugam̐ gaḍadānanā
simmusu nā kichchagālu seya nele tānū
(||tā nĕṁta||)
salamunam̐ dana mām̐ṭa javadām̐ṭenā
sĕlulasem̐ jĕppiṁchī sĕllam̐bo vīm̐ḍu
salimi balimi nādo sārĕm̐ jĕlladā
vĕli na nnŏḍam̐barasī vĕra pele tānū
(||tā nĕṁta||)
yidarulavalĕm̐ dannu nĕggu lĕṁchenā
adivinayālu sesī naune tānu
yida vai śhrīvĕṁṭeśhuḍiṭṭĕ kūḍĕnu
madiloni vĕludulu mari yāle tānū