Taa nemta ne nemta tagavaa vo selulaala

తా నెంత నే నెంత తగవా వో చెలులాల
Language

(॥పల్లవి॥)
తా నెంత నే నెంత తగవా వో చెలులాల
వీనులార నీ సుద్దులు వినరే మీరు

(॥॥)
చేరి తన కూడిగాలు సేయుచు నుండే తన్ను
వూరకే మంచముపైఁ గూచుండు మనీనే
కోరి తనకుఁ బాదాలు గుద్దే యటువంటి నన్ను
ఆరజానఁ బక్కఁ బండు మనీనే తాను

(॥॥)
వాడికతోఁ గూర లెల్లా వడ్డించే యట్టి నన్ను
వేడుకఁ బొత్తుకుఁ బిల్చి వేఁడుకొనీనే
వోడక తన పదాలు వుంచాన నేఁ బాడఁ గాను
వీడెము నా చేతి కిచ్చి వేమారుఁ జెనకీనే

(॥॥)
కూరిమితో వద్ద నుండి కొలువు నేఁ జేయఁగాను
గోర గీరి యంత లోనే కొంగు పట్టీనే
యీ రీతి శ్రీ వేంకటేశుఁడే నలమేలుమంగను
మేర మీఱి నన్నుఁ గూడి మెచ్చులు మెచ్చీనే

(||pallavi||)
tā nĕṁta ne nĕṁta tagavā vo sĕlulāla
vīnulāra nī suddulu vinare mīru

(||||)
seri tana kūḍigālu seyusu nuṁḍe tannu
vūrage maṁchamubaim̐ gūsuṁḍu manīne
kori tanagum̐ bādālu gudde yaḍuvaṁṭi nannu
ārajānam̐ bakkam̐ baṁḍu manīne tānu

(||||)
vāḍigadom̐ gūra lĕllā vaḍḍiṁche yaṭṭi nannu
veḍugam̐ bŏttugum̐ bilsi vem̐ḍugŏnīne
voḍaga tana padālu vuṁchāna nem̐ bāḍam̐ gānu
vīḍĕmu nā sedi kichchi vemārum̐ jĕnagīne

(||||)
kūrimido vadda nuṁḍi kŏluvu nem̐ jeyam̐gānu
gora gīri yaṁta lone kŏṁgu paṭṭīne
yī rīdi śhrī veṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
mera mīṟi nannum̐ gūḍi mĕchchulu mĕchchīne