Taa nemi sesune tana voja limte kaaga

తా నేమి సేసునే తన వోజ లింతే కాక
Language

(॥పల్లవి॥)
తా నేమి సేసునే తన వోజ లింతే కాక
నే నే వలచినదాననేఁ దన్ను దూరేనా

(॥తానేమి॥)
వుప్పతించి యాఁటదాని వొలిసీ నొల్లనివాఁడు
చప్పఁగా మాటలాడి సాదించును
చిప్పలఁగ నిమ్మపండు చేతికిఁ గాను కిచ్చితే
చొప్పులెత్తి పులుసంటా సోదించవచ్చును

(॥తానేమి॥)
గక్కనఁ జేతికి లోనుగానియట్టి రమణుఁడు
తక్కి వట్టి వలపులు తవ్వించును
చిక్కించుకొని యప్పటిచేతికి వీడె మిచ్చితే
కక్కసించి యంతలోనె కార మాయ ననును

(॥తానేమి॥)
జూటుఁ దనములవాఁడు సుదతులు నవ్వితేను
పాటించి యారజమని పచ్చిసేసును
యీటున శ్రీవేంకటేశుఁ డితఁడే నన్నుఁ గూడె
గాటపు నామోవితేనె కడుఁ దీపు లనును

(||pallavi||)
tā nemi sesune tana voja liṁte kāga
ne ne valasinadānanem̐ dannu dūrenā

(||tānemi||)
vuppadiṁchi yām̐ṭadāni vŏlisī nŏllanivām̐ḍu
sappam̐gā māḍalāḍi sādiṁchunu
sippalam̐ga nimmabaṁḍu sedigim̐ gānu kichchide
sŏppulĕtti pulusaṁṭā sodiṁchavachchunu

(||tānemi||)
gakkanam̐ jedigi lonugāniyaṭṭi ramaṇum̐ḍu
takki vaṭṭi valabulu tavviṁchunu
sikkiṁchugŏni yappaḍisedigi vīḍĕ michchide
kakkasiṁchi yaṁtalonĕ kāra māya nanunu

(||tānemi||)
jūḍum̐ danamulavām̐ḍu sudadulu navvidenu
pāḍiṁchi yārajamani pachchisesunu
yīḍuna śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍe nannum̐ gūḍĕ
gāḍabu nāmovidenĕ kaḍum̐ dību lanunu