Taa nela vasivaadee daggara rammanave

తా నేల వసివాడీ దగ్గర రమ్మనవే
Language

(॥పల్లవి॥)
తా నేల వసివాడీ దగ్గర రమ్మనవే
నేనే వెజ్జరికము నేరుతు నందుకునూ

(॥॥)
యెదిరి వారి చూపులు యెంత దన్ను నాఁటెనో
మదన వేద మంత్రాల మంత్రింతునటే
కదియఁ గాఁ జన్నులు కాయ మెంత వొత్తునో
గుదిగొనఁ గాంతు నటే గోరి వెచ్చ కౌఁగిటా

(॥॥)
చెనకే వారి చేఁతల చిత్త మెంత మఱచెనో
మొన గోరి సంజీవి మోపుదు నటే
పెనఁగఁగా మర్మాలు ప్రేమ నెంత గరఁగెనో
తనిపి పేరింతునటే తరితీపు సిగ్గులా

(॥॥)
మందవారి మాటలు మరులు గొలిపెనో
దిందుపడ వలపు ల మందిత్తునటే
అందపు శ్రీ వేంకటేశుఁ డలమేల్మంగను నేను
చెందె నన్ను నిఁక నిట్టే సేతు నటే సేవలూ

(||pallavi||)
tā nela vasivāḍī daggara rammanave
nene vĕjjarigamu nerudu naṁdugunū

(||||)
yĕdiri vāri sūbulu yĕṁta dannu nām̐ṭĕno
madana veda maṁtrāla maṁtriṁtunaḍe
kadiyam̐ gām̐ jannulu kāya mĕṁta vŏttuno
gudigŏnam̐ gāṁtu naḍe gori vĕchcha kaum̐giḍā

(||||)
sĕnage vāri sem̐tala sitta mĕṁta maṟasĕno
mŏna gori saṁjīvi mobudu naḍe
pĕnam̐gam̐gā marmālu prema nĕṁta garam̐gĕno
tanibi periṁtunaḍe taridību siggulā

(||||)
maṁdavāri māḍalu marulu gŏlibĕno
diṁdubaḍa valabu la maṁdittunaḍe
aṁdabu śhrī veṁkaḍeśhum̐ ḍalamelmaṁganu nenu
sĕṁdĕ nannu nim̐ka niṭṭe sedu naḍe sevalū